Last Updated:

China : చైనా ఐ ఫోన్‌ ఫ్యాక్టరీకార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ - ఫోన్‌ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్‌డౌన్‌ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

China : చైనా ఐ ఫోన్‌ ఫ్యాక్టరీకార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

China: చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ – ఫోన్‌ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్‌డౌన్‌ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. కేవలం హెల్త్‌ వలంటీర్లు.. అత్యవస సేవలు అందించే కార్మికులకు మాత్రమే బయట తిరగడానికి అనుమతిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్‌ చికిత్సకు ఆస్పత్రికి వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన సామాన్య ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.

గత వారం ఐ ఫోన్‌ ప్లాంట్‌ నుంచి వందలాది మంది కార్మికులు ప్లాంట్‌ నుంచి పారిపోతున్న దృశ్యాలు చైనీస్‌ సోషల్‌మీడియాలో కనిపించాయి. కాగా ఈ ప్లాంట్‌ను తైవాన్‌కు చెందిన టెక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ నిర్వహిస్తోంది. ప్లాంట్‌ నుంచి వేలాది మంది కార్మికులు స్వచ్చందంగా బయటకు వచ్చారు. అయితే కార్మికుల వాదన ఏమిటంటే ప్లాంట్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. ఇక్కడే ఉంటే కొవిడ్‌ వైరస్‌ తప్పకుండా వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళనతో ఇక్కడి నుంచి కార్మికులు వెళ్లి పోతున్నారని చెబుతున్నారు. ఇక చైనా ప్రభుత్వం మాత్రం జీరో కోవిడ్‌ స్ర్టాటజినీ అమలు చేస్తోంది. అనుమానం వచ్చిందంటే అక్కడికకక్కడే లాక్‌డౌన్‌ విధించడంతో పాటు పెద్ద ఎత్తున టెస్టింగ్‌లు చేయించడంతో పాటు క్వారంటైన్‌లకు పంపుతోంది. వీలైనంత వరకు కొవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది.

కొవిడ్‌ కొత్త వెరియంట్‌ శరవేగంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌లు విధించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జెంగ్జౌ జిల్లా అధికారులు మాత్రం అన్నీ వ్యాపార సంస్థలు వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. కీలకమైన వ్యాపారులను మాత్రం యధావిధిగా తమ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించింది. అయితే ఏ వ్యాపారాలు ఏ కేటగిరిలోకి వస్తాయనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కేవలం మెడికల్‌ వెహికల్స్‌తో పాటు నిత్యావసర వస్తువులు డెలివరీ చేసే వాహనాలను మాత్రం రోడ్లపైకి అనుమతిస్తున్నారు. జెంగ్జౌ జిల్లాలో సుమారు 6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి రోజు వీరికి అగ్నిపరీక్షే అని స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

ఇక ఐ ఫోన్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్‌ మాత్రం తమ ఉద్యోగులకు రోజువారి పరీక్షలు జరిపిన తర్వాతనే విధుల్లోకి అనుమతిస్తున్నామని అన్నారు. ఒక వేళ ఉద్యోగి ఆరోగ్యం సరిగా లేక ఇంటికి వెళ్లిపోతామని అంటే వారికి రవాణా సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. చాలా మంది కార్మికులు సూట్‌కేసులు తీసుకొని మోటార్‌వే ద్వారా నడచుకుంటూ తమ స్వస్థాలకు పోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కాగా స్థానిక ప్రభుత్వం కూడా ఫాక్స్‌కాన్‌లో పనిచేసే కార్మికులు ఇళ్లకు వెళ్లాలంటే అధికారులు వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని…. తిరిగి విధుల్లో చేరే ముందుఎన్ని రోజు క్వారంటైన్‌లో ఉన్నది తెలియజేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి: