Published On:

India Pakistan War: యుద్ధంలో భారత్ కు తోడుగా బెలూచ్ ఆర్మీ!

India Pakistan War: యుద్ధంలో భారత్ కు తోడుగా బెలూచ్ ఆర్మీ!

Baloch Army Support India: భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో భారత్ కు చేదోడుగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ ఆర్మీగా పనిచేసి.. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెడతామని ప్రకటించింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కోరింది. పాకిస్తాన్ పై దాడి కొనసాగించాలని  విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్‌పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే.. పాక్‌పై దాడి చేస్తామని తెలిపింది.

 

పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారతదేశం నుంచి సహాయం కోరుతూ.. లేఖ రాసింది.. భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయాలని కోరింది. భారతదేశం ఒక అడుగు ముందుకు వేస్తే. పశ్చిమ దేశాల నుండి దానిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని, ప్రాంతీయ సైనిక.. రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీగా ఎదిగిందని స్పష్టం చేసింది.

 

పాకిస్తాన్ శాంతి – కాల్పుల విరమణ ప్రకటనలను తప్పుడు ప్రచారం.. మోసంగా BLA అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య మాత్రమే అని లేఖలో తెలిపింది. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని తాము భారతదేశం, ప్రాంతీయ శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని కోరింది.. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన BLA, పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పనిచేస్తుందని మండిపడింది.

 

ఎవరి మద్దతు లేకుండా, బలూచిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ లాంటి అణ్వాయుధ శక్తిని అనేక రంగాల్లో ఓడించామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్‌ను దాని మూలాల నుంచి నిర్మూలించడానికి భారతదేశం తమకు రాజకీయ, దౌత్య, సైనిక మద్దతు ఇవ్వాలని కోరింది. పాకిస్తాన్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బిఎల్‌ఎ తెలిపింది.

 

భారతదేశం పాకిస్తాన్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకుంటే, పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి BLA సిద్ధంగా ఉందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ప్రపంచం ఈ అవకాశాన్ని గుర్తించకపోతే, బలూచ్ ప్రజలు ఈ పోరాటాన్ని స్వయంగా కొనసాగిస్తారని BLA తెలిపింది. స్వతంత్ర బలూచిస్తాన్ మాత్రమే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, సమతుల్యత, ఉగ్రవాదాన్ని అంతం చేయగలదని ప్రకటించింది.