Published On:

Diabetes: డయాబెటిస్‌ ఉన్న వారిలో.. షుగర్ లెవల్స్ తరచూ ఎందుకు మారతాయో తెలుసా ?

Diabetes: డయాబెటిస్‌ ఉన్న వారిలో.. షుగర్ లెవల్స్ తరచూ ఎందుకు మారతాయో తెలుసా ?

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మీ శరీరంలో కూడా చక్కెర స్థాయి కూడా పదే పదే పెరుగినా లేదా తగ్గినా ? అందుకు గల కారణాలను తెలుసుకుని సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులు, నరాల దెబ్బతినడం, దృష్టి సంబంధిత సమస్యలు, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి మధుమేహ సమస్యలను నివారించవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. దీని కోసం మీ తినే ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అంతే కాకుండా శారీరకంగా చురుకుగా ఉండటం ముఖ్యం.

రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా అదుపులో లేని వ్యక్తులలో అలసట, బలహీనత , నిద్ర సంబంధిత సమస్యలు చాలా సాధారణం అని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర పెరుగుదలకు గల కారణాలను తెలుసుకోవడం, వాటిని నివారించడానికి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకీ రక్తంలో చక్కెర స్థాయి మళ్లీ మళ్లీ పెరగడానికి లేదా తగ్గడానికి గల కారణాలు ఏమిటో, దానిని నియంత్రించడానికి ఏం చేయాలో తెలుసుకుందామా..

నీరు తాగటం : శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో నీరు తగ్గడం వల్ల హైపర్గ్లైసీమియా వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. మీ రక్తంలో చక్కెర పెరిగేకొద్దీ, మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. ఫలితంగా మరింత నిర్జలీకరణం జరుగుతుంది. మధుమేహం ఉన్నవారు హైడ్రేటెడ్ గా , ఆరోగ్యంగా ఉండటానికి రోజంతా పుష్కలంగా నీరు లేదా ఇతర కేలరీలు లేని డ్రింక్స్ త్రాగాలి. పుష్కలంగా నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలను కూడా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది.

పీరియడ్స్ : మహిళల్లో షుగర్ పెరడగం, తగ్గడం వంటివి పీరియడ్స్ వల్ల కూడా రావచ్చు. ఈ సమయంలో కడుపు నొప్పి, వాపు వంటి సమస్యలు ఉండటం చాలా సాధారణం. కానీ అది రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా? CDC ప్రకారం ప్రీమెన్స్ట్రువల్ దశలో హార్మోన్ల మార్పులు రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న కొంతమంది స్త్రీలు వారి పీరియడ్స్ సమయంలో ఇన్సులిన్‌కు తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రోజుల్లో సరైన ఆహారం, జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

నిద్ర లేకపోవడం: రాత్రిపూట మీకు తగినంత నిద్ర రాకపోతే, ఇది మరుసటి రోజు మానసిక స్థితి , శక్తి సంబంధిత సమస్యలను కలిగించడమే కాకుండా మీ రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులకు కూడా కారణమవుతుంది. 2015 లో ప్రచురితమైన ఒక సమీక్ష ప్రకారం ..నిద్ర లోపం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ సున్నితత్వాన్ని దెబ్బతీస్తుందని తేల్చింది. నిద్ర తగినంత ఉన్నప్పుడు మాత్రమే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్న వారు నిద్ర పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి: