Published On:

Snow Akka Mouneesha Chowdary: తెలుగు డైరెక్టర్‌ నా థైస్‌ కొలతలు అడిగాడు – అమెరికా మోడల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Snow Akka Mouneesha Chowdary: తెలుగు డైరెక్టర్‌ నా థైస్‌ కొలతలు అడిగాడు – అమెరికా మోడల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Snow Akka Mouneesha Chowdary About Casting Couch: ఓ తెలుగు స్టార్‌ డైరెక్టర్‌ మోడల్‌ మౌనీషా చౌదరి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సినిమా అవకాశం ఇస్తానంటూ ఫోన్‌ చేసి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది తరచూ వింటూనే ఉంటున్నాం. దీనిపై మీ టూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. అయినా కూడా కాస్టింగ్‌ కౌచ్‌, ఆడవాళ్లపై వేధింపులు మాత్రం ఆగడం లేదు.

 

మీ టూ తర్వాత కూడా ఎంతోమంది నటీమణులు బయటకు వచ్చి తమకు ఎదురైన ఛేదు అనుభవాలను బయట పెడుతూనే ఉన్నారు.  ఎప్పుడూ.. ఎక్కడో అక్కడ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితులు బయటకు వస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా తెలుగు మోడల్‌ మౌనీషా చౌదరికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ నుంచి ఛేదు అనుభవం ఎదురైంది. ఆమెరికాలో సెటిలైన ఆమె అక్కడ ఓ ఇండియన్‌ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా మోడలైన ఆమెకు సినిమా అవకాశాలపై ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై స్పందిస్తూ.. ఓ తెలుగు డైరెక్టర్‌ వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

 

“టాలీవుడ్‌ దర్శకుడు నాకు ఫోన్‌ చేశాడు. తాను ఓ సినిమా తీస్తున్నానని, అందులో నన్ను నటించాలని కోరాడు. అవకాశం ఇస్తానని చెప్పాడు. అప్పుడు నాకు సినిమాలో నటించాలనే ఆసక్తి లేదు. ఆ సినిమా చేయాలని కూడా నేను అనుకోలేదు. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాను. అయినా వినకుండ అవకాశం ఇస్తానంటూ నన్ను ఇబ్బంది పెట్టాడు. తన థైస్‌ సైజ్‌ (తొడలు కొలతలు) అడిగి నన్ను ఇబ్బంది పెట్టాడు. అసలు సినిమా అవకాశానికి, తొడల కొలతలకు సంబంధం ఏంటీ? ఇప్పుడాయన తెలుగులో పెద్ద స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్‌ ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే మౌనీషా ఆ దర్శకుడి చెప్పేందుకు నిరాకరించింది.

 

కాగా తెలుగమ్మాయి అయిన మౌనీషా ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. 2016లో ఆమె మిస్‌ ఆసియా ఉతా కీరిటం గెలిచింది. కొంతకాలం మోడల్‌గా రాణించిన ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిలైపోయింది. ప్రస్తుతం ఆమెకు ఓ కూతురు కూడా జన్మిచ్చింది. తల్లయిన తర్వాత కూడా ఆమె మోడలింగ్‌ చేస్తూనే ఉంది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఆమె ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ వైరల్‌ కంటెంట్‌, మోడలింగ్‌ వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నో అక్కగా గుర్తింపు పొందింది.అచ్చిరాని తెలుగు మాట్లాడుతూ ట్రోల్స్‌ కూడా ఎదుర్కొంటోంది. అవేవి పట్టించుకోకుండా.. అదే తెలుగుతో ఫన్నీ ఫన్నీ వీడియోలు పోస్ట్‌ చేస్తూ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఆమె ఇటీవల మంచు కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది.అమెరికాలో జరిగిన కన్నప్ప టూర్‌లో ఆమె పాల్గొని సినిమాను ప్రమోట్‌ చేసింది.