Pregnancy after 35: 35 ఏళ్లకు తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి.. మంచి ఫలితాలు పొందుతారు!

Pregnancy After 35 Complications Suggestions: ఆరోగ్యకరమైన గర్భం ధరించడానికి, అందమైన మాతృత్వం కోసం ప్రతీ మహిళా కలలు కంటుంది. అయితే.. 35ఏళ్ల వయసులో గర్భం దాల్చడం ఆరోగ్య పరంగా చాలా కష్టమైన విషయం. ఇందుకు చాలా నియమాలు పాటించాలి. మారిన సామాజిక పరిస్థితులలో స్త్రీ పురుషులిద్దరు ఆలస్యంగా వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. అందుకు ముఖ్యమైన కారణం కెరీర్. ఒక ఆశయాన్ని పెట్టుకుని దాన్ని అందుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో యువతకు 30 – 35 ఏళ్లు వస్తేకాని పెళ్ళికి రెడీ కాలేకపోతున్నారు. ఈ మార్పు వలన పెళ్ళితో పాటు పేరెంట్స్ అయ్యేందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇవేకాకుండా దూమపానం, ఆహారం కూడా సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మానసికంగా, శారీరకంగానూ ఎంతో ప్రభావాన్ని చూపెడుతున్నాయి.
సంతానోత్పత్తి క్షీణత జీవసంబంధమైనది మాత్రమే కాదు, అనారోగ్యకరమైన అలవాట్ల వలన కూడా తీవ్రంగా పరిగనించబడుతుంది. 35ఏళ్ల వయసులో పిల్లలను కనే ప్రక్రియ పలచనబడటం మొదలవుతుంది. దూమపానం, మధ్యపానం అతిగా సేవించే అలవాట్లు ఉంటే మరింత సమస్యలు ఎదురవుతాయి. స్పెర్మ్ నాణ్యత తగ్గే అవకాశం ఉంది.
భవిష్యత్తులో సంతానోత్పత్తిని కాపాడుకోవడం
లేటుగా పిల్లల్ని కనాలని అనుకునేవారు వారి అండాలను నిల్వచేసుకోవచ్చు. ఇది యుక్తవయసులో నిల్వచేస్తే కావాలనుకున్నప్పుడు పిల్లలను కనవచ్చు.
35ఏళ్ల తర్వాత మహిళలు గర్భాన్ని దాల్చగలరు. కానీ గర్భధారణలో వృద్ధాప్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల వయస్సు పెరుగుతున్న కొద్ది గర్భాధారణ సమయంలో షుగర్, బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటే క్రోమోజోమ్ అసాధారణంగా ప్రవర్తించడం, డౌన్ సిండ్రోమ్, తల్లి వయస్సు పెరుగుతున్న కొలది గర్భం, ప్రసవం మరింత క్లిష్టంగా మారుతుంది. నార్మల్ డెలివరీ కాకుండా సిజిరియన్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. దీంతో తల్లి ఆరోగ్యం భవిష్యత్తులో దెబ్బతింటుంది.
35ఏళ్లకు తల్లిదండ్రులు కావాలనుకునే దంపతులు, మహిళలు, యువకులు ముందుగానే జాగ్రత్తలు పాటించాలి. దూమపానం మానేయడం, మిత మధ్యపానం, స్ట్రెస్ లేకుండా ఉండటం క్రమం తప్పని వ్యాయామం తప్పనిసరి. మెరుగైన జీవనశైలి ఉంటేనే 35ఏళ్ల వయస్సులో పిల్లల్ని కనే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.