Published On:

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’.. పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం – రూ. 11 కోట్లు వెనక్కి

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’.. పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం – రూ. 11 కోట్లు వెనక్కి

Pawan Kalyan Return Money to Producer Hari Hara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ మూవీ రెమ్యునరేషన్‌ని ఆయన వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. కాగా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పవన్‌ నటించిన చిత్రమిది. చివరిగా ఆయన బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి రూ. 40 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు చెప్పారు. జనసేన పార్టీ సమావేశంలో ఆయనే స్వయంగా తన రెమ్యునరేషన్‌ని చెప్పారు. అటువంటిది పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన బ్రో మూవీకి ఆయన పారితోషికం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 

సుమారు రూ. 75 కోట్లనే సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. ఇది రూమరైన.. ఎంతకాదన్న ఆయన దగ్గర దగ్గర రూ. 50 కోట్ల పైనే తీసుకుని ఉంటారు. వీరమల్లు మూవీ కోసం నిర్మాత ఏం రత్నం అడ్వాన్స్‌గా పవన్‌కు రూ. 11కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చారట. ఈ సినిమా ఎప్పుడో 2019లో ప్రకటించగా.. 2020లో సెట్స్‌పైకి వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల కారణంగా ఈ చిత్రం తరచూ వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్‌కే దాదాపు ఐదేళ్లు పట్టింది. ఇన్నేళ్ల పాటు మూవీ సెట్స్‌లోనే ఉండటంతో వల్ల నిర్మాతకు అదనపు ఆర్థిక భారం ఎక్కువే పడిఉంటుంది. అది అర్థం చేసుకున్న పవన్‌ వీరమల్లు కోసం తనకు ఎలాంటి పారితోషికం వద్దన్నారట. ఆయన ఇచ్చిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

కాగా హరి హర వీరమల్లు 2020లో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. మొదట క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. దాదాపు చాలా భాగం షూటింగ్‌ క్రిష్‌ దర్శకత్వంలోనే పూర్తయ్యింది. గతనెల మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అది కూడా సుధీర్ఘ కాలం తర్వాత. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసిన పవన్‌.. భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతు చేపట్టిన ఆయన ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సినిమాలను పక్కన పెట్టారు.

 

ఇక తనను నమ్మిన దర్శక-నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగకుండ తాను కమిటైన చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించుకుని వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలా గత నెల హరి హర వీరమల్లు మూవీ షూటింగ్‌ పూర్తై జూన్‌ 12న విడుదలకు సిద్ధమైంది. గత ఫిబ్రవరిలో రిలీజ్‌ అన్నారు. అది వాయిదా పడింది. మార్చిలో అన్నారు..అక్కడ నుంచి మే 30కి సినిమా విడుదల తేదీ ఉండోచ్చనే సమాచారం కూడా ఉంది. కానీ, వీఎఫ్‌ఎక్స్‌, సీజీ వర్క్‌ పనులు ఆలస్యం కారణంగా హరి హర వీరమల్లును జూన్‌ 12న విడుదల చేస్తున్నట్టు ఇటీవల మూవీ ప్రకటించింది. ఇక సినిమా విడుదలకు ఏ అడ్డంకులు లేవని ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్న క్రమంలో థియేటర్ల బంద్‌ అన్నారు.

 

అదీ లేదని తెలిసి అంతా ఖుష్‌ అయ్యారు. ఈ క్రమంలో ఈ మూవీ మళ్లీ వాయిదా పడేలా ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు మూవీ టీం దీనిపై స్పందించలేదు. కానీ, హరి హర వీరమల్లు పారితోషికాన్ని పవన్‌ వెనక్కి ఇచ్చినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. రెమ్యునరేషన్‌ తీసుకోకపోవడమే కాదు.. నిర్మాత ఏఎమ్‌ రత్నం ఇచ్చిన రూ. 11 లక్షల డబ్బులను కూడా వెనక్కి ఇచ్చారట. దీంతో పవన్‌ పెద్ద మనసు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ, భారీ హిస్టారికల్‌ డ్రామా అయిన హరి హర వీరమల్లు లాంటి భారీ సినిమాకు ఆయన పారితోషికాన్ని తిరస్కరించడం ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. పవన్‌ గొప్ప మనసుపై ప్రశంసలు కురుస్తున్నాయి.