Last Updated:

Rashmika Mandanna: నా హృదయంలో మీకు ప్రత్యేక స్థానం ఉంది – రష్మిక ఆసక్తిక పోస్ట్‌

Rashmika Mandanna: నా హృదయంలో మీకు ప్రత్యేక స్థానం ఉంది – రష్మిక ఆసక్తిక పోస్ట్‌

Rashmika Mandanna Thanks to Pushpa 2: హీరోయిన్‌ రష్మిక మందన్న ప్రస్తుతం నడలేవని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ ఆమె తీవ్రంగా గాయపడింది. కాలికి బలమైన గాయం అయినందుకున్న ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె పుష్ప 2 టీం నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొనలేకపోయింది. శనివారం సాయంత్రం పుష్ప 2 మూవీ ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. సుమారు 1831పైగా కోట్ల వసూళ్లతో ఇండియాలో హయ్యేస్ట్‌ గ్రాస్‌ చేసిన రెండవ చిత్రంగా రికార్డుకు ఎక్కింది. దీంతో పుష్ప 2 మూవీ టీం ఫిబ్రవరి 8న థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది.

అయితే దీనికి హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌, నిర్మాతలతో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రష్మిక మాత్రం మిస్‌ అయ్యింది. దీనిపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. “నిన్న జరిగిన ‘పుష్ప 2’ థ్యాంక్యూ మీట్‌లో నేను పాల్గొనలేకపోయాను. అయితే, ఈ సందర్భంగా నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. పుష్ప 2 నన్ను భాగం చేసిన సుకుమార్‌ సర్‌, అల్లు అర్జున్‌, మైత్రీ మూవీ మేకర్స్‌కి చాలా చాలా థ్యాంక్స్‌. మీరెంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్‌పీస్‌ సినిమాను అందించినందుకు ఒక ప్రేక్షకురాలిగా ధన్యవాదాలు తెలుపుతున్న. అదే విధంగా శ్రీవల్లిగా మీకు ఎప్పటికీ నా హృదయంలో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఈ సినిమాని తెరకెక్కించడంలో అన్ని విభాగాలు అద్భుతంగా వర్క్‌ చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్‌ ఇచ్చినందుకు థ్యాంక్యూ” అంటూ రాసుకొచ్చింది. కాగా డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్‌ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పాన్‌ స్థాయిలో విడుదలైన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా మోతమోగించింది. ఇక దీనికి సీక్వెల్‌ పుష్ప: ది రైజ్‌ అంటూ పార్ట్‌ని తీసుకువచ్చాడు. 2024 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది.

ఇవి కూడా చదవండి: