China Debt Trap: పేద దేశాల మెడపై చైనా అప్పుల కత్తి..!

ఈ ఏడాది చైనాకు 75 అత్యంత పేద దేశాలు సుమారు 22 బిలియన్ డాలర్లు చెల్లించాలి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు రెండు లక్షల కోట్లు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విధంగా చైనా పేద దేశాలను అప్పుల ఊబిలో దించిందని చెప్పుకోవాల్సిందే. ఇక చైనా వసూలు చేసే వడ్డీ కూడా మామాలుగా ఉండదు. వాణిజ్య బ్యాంకుల రేటు కంటే కాస్తా ఎక్కువగా వసూలు చేస్తోంది.
ప్రస్తుతం చైనా నుంచి డబ్బు తీసుకున్న దేశాలు దిక్కుతోచక సతమతమవుతున్నాయి. లేదంటే దేశంలో కొంత భాగం చైనా విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ స్టేజీలో చైనా ప్రస్తుతం కాబూలీవాల్ పాత్ర పోషిస్తోంది. అప్పులు ఇచ్చి బలవంతంగా వసూలు చేసుకుంటోంది. ప్రత్యేక కథనంలో చైనా కాబూలీవాల పాత్ర గురించి తెలుసుకుందాం.