Published On:

Flood Into Krishna River: కృష్ణా నది ప్రాజెక్టుల్లోకి భారీగా వరద

Flood Into Krishna River: కృష్ణా నది ప్రాజెక్టుల్లోకి భారీగా వరద

Heavy Rains In Krishna River Region: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కొంత ముందుగానే ప్రాజెక్ట్ ల్లోకి నీరు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువ శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ కు 65 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 73542 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.300 మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్ లో జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన జూరాల, తుంగభద్ర నుంచి వరదను విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం మొదలైంది. ప్రాజెక్ట్ లోకి 75,551 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దిగువకు మాత్రం నీటిని విడుదల చేయడం లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 848.30 అడుగుల నీటిమట్టం ఉంది.