Last Updated:

Pushpa 2 OTT: 56 రోజులు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’ – ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

Pushpa 2 OTT: 56 రోజులు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’ – ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

Pushpa 2 Movie OTT Release: ‘పుష్ప 2’ మూవీ విడుదలై 56 రోజులు అవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బ్రేక్‌ చేసుకుంటూ దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతుంది. కేవలం 32 రోజుల్లోనే ఈ మూవీ రూ. 1831 కోట్లకు పైగా గ్రాస్‌తో బాక్సాపీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాగా రికార్డుకు ఎక్కింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో బాహుబలి 2 ఉండగా దానిని బ్రేక్‌ చేసింది. మొదటి స్థానంలో ఉన్న అమిర్‌ ఖాన్‌ దంగల్‌ మూవీ కలెక్షన్స్‌ (దంగల్‌ రూ. 2000 కోట్లు)మాత్రం అధిగమించలేకపోయింది.

ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో ‘పుష్ప 2’ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ చేసిన చిత్రంగా పుష్ప 2 టాప్‌లో ఉంది. అంతేకాదు తొలి డబ్బింగ్‌ చిత్రంగా కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక హిందీలోనే ఈ సినిమా రూ. 800 కోట్ల గ్రాస్ చేయగా.. ఓవరాల్‌ఇండియాలో రూ. 1230.55 కోట్ల (నెట్‌) వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం రీ లోడెడ్‌ వెర్షన్‌కు థియేటర్లో మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే మూవీ విడుదలై 56 రోజులు పూర్తయ్యింది.

అయితే ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు. కానీ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండు నెలల తర్వాత పుష్ప 2 ఓటీటీకి వస్తుందని ఇప్పటికే మేకర్స్‌ స్పష్టం చేశారు. మూవీ రిలీజై 56 రోజులు అవుతుంది. ఇంకా నాలుగు రోజుల్లో రెండు నెలలు పూర్తి చేసుకుంటుంది. దీంతో ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే అప్‌డేట్‌ రానుందని మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌పాం నెట్‌ప్లిక్స్‌ ‘పుష్ప 2’ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఒప్పందం ప్రకారం త్వరలోనే సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే రీలోడెడ్‌ వెర్షన్‌ కూడా యాడ్‌ చేయాలి కాబట్టి.. పుష్ప 2 ఓటీటీ రిలీజ్‌ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందంటున్నాయి సినీవర్గాలు. ఇప్పటికే రిలీజ్‌ టైంలో పుష్ప 2 నిడివి 3:20 నిమిషాలు ఉంది. అదనంగా 20 నిమిషాలు యాడ్‌ చేయడంతో ఈ సినిమా నిడివి 3:40 నిమిషాలకు చేరుకుంది. దీనికి అదనంగా మరికొన్ని సీన్స్‌ జోడించి పుష్ప 2ను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. జనవరి 31న లేదా ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రానున్నట్టు తెలుస్తోంది.