Last Updated:

Pawan Kalyan: అభిమానుల తీరుపై పవన్‌ కళ్యాణ్‌ అసహనం – వీడియో వైరల్‌

Pawan Kalyan: అభిమానుల తీరుపై పవన్‌ కళ్యాణ్‌ అసహనం – వీడియో వైరల్‌

Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్‌ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్ రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు.

ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ఎంపీడీవో దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన బాధ్యులను వదలిపెట్టమని హెచ్చరించారు. ఆఫీసర్‌పై దాడి ఘటనను జరగడం బాధకరమన్నారు. దీనికి కారణమైన బాధ్యులను విడిపెట్టబోమని హెచ్చరించారు. ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్‌ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిపై దాడి చేయడం సహించరానిది.

కచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుని బాధ్యులకు తగిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అక్కడ ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతుండగా.. వారంత అత్యుత్సాహం చూపించారు. కళ్యాణ్‌ బాబు, కళ్యాణ్‌ బాబు అంటూ అరవడం మొదలుపెట్టారు. వారి అత్యుత్సాహం తగ్గించకోమని మొదటి సూచించారు. అరవద్దని చెప్పారు. అయినా ఫ్యాన్స్‌ అత్యూత్సాహం చూపిస్తూ ఓజీ.. ఓజీ.. ఓజీ అని అరవడం మొదలు పెట్టారు. అది విన్న ఆయన ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో తెలియదు, పక్కకు రండి” అంటూ అసహనం తెలియజేశారు.