Last Updated:

Motorola Mobile Offers: తక్కువ ధరకే ఇస్తున్నారు.. మోటో ఫోన్‌పై రూ.6 వేల డిస్కౌంట్..!

Motorola Mobile Offers: తక్కువ ధరకే ఇస్తున్నారు.. మోటో ఫోన్‌పై రూ.6 వేల డిస్కౌంట్..!

Motorola Mobile Offers: మీరు ప్రీమియం డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ ఫోన్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకొనే వారిని లక్ష్యంగా చేసుకొని ప్రముఖ కంపెనీలు, ప్రీమియం డిజైన్, స్టైలిష్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీతో పోటీపడుతున్నాయి. ‘Motorola Edge 50’ స్మార్ట్‌ఫోన్ ఈ పోటీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Motorola Edge 50 Price And Offers
మోటరోలా ఎడ్జ్ 50 ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999కి విక్రయిస్తోంది. అంటే నేరుగా రూ.6,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 1,500 అదనపు తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో, మీరు ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే కొనచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్,కోలా గ్రే కలర్ ఆప్షన్‌లలో ఆర్డర్ చేయచ్చు.

Motorola Edge 50 Features
మోటరోలా ఎడ్జ్ 50 ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1,200 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మోటరోలా మొబైల్ Android 14 ఆధారంగా Hello UI OSతో పనిచేస్తుంది. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.

మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 10-మెగాపిక్సెల్ మూడవ కెమెరాను ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ అందించారు. ఇది 15W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.