Last Updated:

Kollagottinadhiro Song: హరిహర వీరమల్లు సెకండ్‌ సింగిల్‌ ప్రొమో – ‘చిచ్చర పిడుగంటివాడు’ అంటూ అలరిస్తున్న పాట

Kollagottinadhiro Song: హరిహర వీరమల్లు సెకండ్‌ సింగిల్‌ ప్రొమో – ‘చిచ్చర పిడుగంటివాడు’ అంటూ అలరిస్తున్న పాట

Kollagottinadhiro Song Promo: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రాబోతోన్న సంగతి తెలిసిందే. కొల్లగొట్టిందిరో అంటూ సాగే ఈ పాట ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట ప్రోమో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది మూవీ టీం. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను సంతకం చేసిన చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

త్వరలోనే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్‌ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ నుంచి వరుస అప్‌డేట్స్‌ ఇస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో పవన్‌ కళ్యాణ్‌ పాడిని మాట వినాలి పేరుతో పాటను రిలీజ్‌ చేయగా.. దానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు సెకండ్‌ సింగిల్‌ పేరుతో రెండో పాటను విడుదల చేయబోతున్నారు.

ఫిబ్రవరి 24న ఈ పాటను రిలీజ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ‘కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో’ అంటూ సాగే ఈ పాట అలరించేలా ఉంది. దీంతో ఫుల్‌ సాంగ్‌పై అంచనాలు నెలకొన్నాయి. యాంకర్‌ అనసూయ, నటి పూజిత పొన్నాడలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను సింగర్‌ మంగ్లీ, రాహుల్‌ సిప్లిగంజ్‌, రమ్య బెహర, యామిని ఘంటసాల పాడారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.