Last Updated:

Natural Star Nani: రెండున్నర గంటలు డోర్ దగ్గరే.. ఇంత సినిమా పిచ్చోడివి ఏంటన్నా.. ?

Natural Star Nani: రెండున్నర గంటలు డోర్ దగ్గరే.. ఇంత సినిమా పిచ్చోడివి ఏంటన్నా.. ?

Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా వరుస సినిమాలతో బూసైగ మారాడు. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగామారి .. విజయాపజయాలను లెక్కచేయకుండా మంచి మంచి కథలను ఎంచుకొని తన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి.. ఇప్పుడు నిర్మాతగా ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

నాని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.  హార్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 14 అనగా రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాని మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా కనుక నచ్చకపోతే తన తదుపరి చిత్రం హిట్ 3 ఎవరు చూడొద్దు అని బహిరంగంగా చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.

 

ఇక కథ మీద ఉన్న నమ్మకంతోనే రెండు రోజుల నుంచి ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చాలా బావుందని చెప్పుకురావడం విశేషం. ఇక నాని కూడా ఆ ప్రీమియర్ షో సమయంలో ఉన్నాడు. అయితే అందరూ కూర్చొని చూస్తుండగా నాని మాత్రం డోర్ దగ్గర నిలబడి రెండున్నర గంటలు సినిమా చూసాడు. అదేంటీ అంత పెద్ద సెలబ్రిటీ.. సినిమాకు నిర్మాతకు సీటు కూడా లేదా.. ? అనే అనుమానాలు రావచ్చు. కానీ. నాని నటించిన, నిర్మించిన ఏ సినిమా అయినా.. ఆయన అలానే చూస్తాడట. ఈ విషయాన్నీ డైరెక్టర్ శివ నిర్వాణ ఒక స్టేజిపై చెప్పుకొచ్చాడు.

 

” ఐమాక్స్ ల 8.45 కు ఆయన ఏ సినిమా రిలీజ్ అయితే.. నాని రెండున్నర గంటల సినిమా డోర్ దగ్గర నిలబడి చూస్తాడు. ఆయన ప్రతి సినిమా అలానే చూసాడు. నిన్నుకోరి సినిమా సమయంలో మేము అందరం ముందు వరసలో కూర్చొని చూస్తుంటే.. ఆయన మాత్రం డోర్ దగ్గరే నిలబడి చూస్తున్నాడు. ఏంటి నాని గారు అక్కడ నుంచి చూస్తారు అని అడిగితే.. నీకు తెలియదు శివ, థియేటర్ లో ఒక మూమెంట్ కు ఒక క్లాప్స్ పడతాయి. ఒక మూమెంట్ కు అందరూ ఒక మూడ్ లోకి వెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్  చూడడం నాకిష్టం. అందుకే డోర్ దగ్గర నిలబడి చూస్తాను” అని చెప్పుకొచ్చాడు.

 

ఇక ఇప్పుడుకోర్ట్ ప్రీమియర్స్ లో కూడా నాని డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉండడాన్ని గమనించిన కొందరు అభిమానులు నాని ఫోటోతో పాటు  శివ నిర్వాణ వీడియోను కూడా జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన నాని అభిమానులు ఇంత సినిమా పిచ్చోడివి ఏంటన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాని  హిట్ 3, ది ప్యారడైజ్  సినిమాలతో బిజీగా ఉన్నాడు.