Shanmukha Official Trailer: క్షణం క్షణం ఉత్కంఠ – ఆది సాయి కుమార్ ‘షణ్ముఖ’ ట్రైలర్ చూశారా!

Shanmukha Telugu Movie Trailer Out: లాంగ్ గ్యాప్ తర్వాత ఆది సాయికుమార్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ‘షణ్ముఖ’ మూవీ తెరకెక్కతోంది. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార పోస్టర్ మూవీ అంచనాలు పెంచాయి. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అసురుడిని ఎదురించిన థీరుడి కథ అంటూ పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
సురులైన, అసురులైన చేసిన తప్పు నుంచి ఎప్పటికి తప్పించుకోలేరు అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ ఆసక్తిని పెంచుతుంది. ఇందులో ఆది సాయి కుమార్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ ట్రైలర్ మొత్తం థ్రిల్లర్, సస్పెన్స్ సన్నివేశాలతో ఉత్కంఠ పెంచుతోంది. అమ్మాయిల కనిపించకపోవడం, అబ్బాయి సూసైడ్‌కి పాల్పడం వంటి మిస్టరీయస్ అంశాల చూట్టూ ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు కలిసి ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వారిక ఎదురైన పరిణామాలను ఆద్యాంతం ఆసక్తిగా చూపించారు. మధ్య మధ్యలో ట్రైలర్‌కి హారర్ టచ్ ఇచ్చి ఉత్కంఠ పెంచారు. ప్రస్తుతం ఈ షణ్ముఖ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచుతోంది.