Harihara Veeramallu Release Date: హరిహర వీరమల్లు.. అప్పుడైనా వస్తాడా.. ?

Harihara Veeramallu Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు పరిమితమయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఆయన కొన్ని సినిమాకు సైన్ చేశారు. అందులో ఒక సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే ప్రచారం అంటూ పవన్ వెళ్లిపోయారు. ప్రచారం వలన కొన్ని నెలలు పోయాయి. ఆ తరువాత ఇంకొన్ని నెలలు డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పిపోవడంతో ఈ షూటింగ్ ఆగింది. ఇక క్రిష్ స్థానంలోకి ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యాడు. అప్పటికే సగంకు పైగా షూటింగ్ ఫినిష్ అవ్వడంతో క్లైమాక్స్ మాత్రం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసి ఎలాగోలా సినిమాను ఫినిష్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. పలు కారణాల వలన వాయిదాలు పడుతూనే వస్తుంది. మార్చి 28. న ఈ సినిమా రిలీజ్ అని మేకర్స్ మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చారు. కానీ, అందుకు తగ్గట్లు ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం మే 9 న రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా నిజం అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియదు. కానీ, ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిరాశపడుతూనే వస్తున్నారు. మార్చి 28 న సినిమా రిలీజ్ అనేసరికి ఇప్పటికే సోషల్ మీడియాలో హాకల్చర్ చేయడం మొదలుపెట్టారు. మరికొన్నిరోజుల్లో మేకర్స్ ఈ సినిమా వాయిదా పడిందని అధికారికంగా చెప్పనున్నారట. మరి ఈ సినిమా మే 9 న అయినా వస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి,