Last Updated:

Tammareddy Bharadwaja: దానికోసం సీఎం ముందు దేహి అని అడుక్కోవడం కరెక్ట్‌ కాదు: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja: దానికోసం సీఎం ముందు దేహి అని అడుక్కోవడం కరెక్ట్‌ కాదు: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja Latest Comments: టికెట్‌ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు సీనియర్‌ దర్శక-నిర్మాత, మాజీ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్న సీఎం రేవంత్‌ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖులు సమావేశానికి తాను వెళ్లలేదని, తనకు ఆహ్వానం అందలేదన్నారు. అది రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి పెట్టిన సమావేశాం కాదన్నారు.

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజును పలివడంతో.. ఆయన కొంతమందిని తీసుకుని వెళ్లి సీఎంను కలిశారు. ఈ సమావేశం బాగా జరింగిందని అక్కడికి వెళ్లిన వాళ్లు నాతో చెప్పారు. ఈ సమావేశంతో ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య గ్యాప్‌ వచ్చిందనే అపోహ తొలిగిపోయిందన్నారు. “మొన్న జరిగిన మీటింగ్‌కు నాకు ఆహ్వానం అందలేదు. టీఎఫ్‌డీసీ తరపున జరిగిన సమావేశం ఇది. ఇది ఛాంబర్‌ మీటింగ్‌ కాదని తెలిసిందే.

ఇండస్ట్రీ అంటే ఛాంబర్‌ ఒక్కటే.. అన్ని సెక్టార్లు కలిపితేనే ఇండస్ట్రీ. అవన్నీ ఛాంబర్‌ కిందకు వస్తాయి. మొన్నటి మీటింగ్‌తో పుష్ప 2తో ఏర్పడిన గ్యాప్‌ పోయింది. అల్లు అర్జున్‌ సమస్య సద్దుమణిగిపోయింది. ఈ సమావేశం సినిమాలకు సంబంధించింది కాదు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య సమన్వయం కోసం జరిగింది. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరడానికి వెళ్లారు.  ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు హీరోహీరోయిన్లు అందరు సపోర్ట్‌ ఉంటుంది.

ఒక్క సినిమా రిలీజ్‌ సమయంలోనే కాదు ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉండాలని నా అభిప్రాయం” అని అన్నారు. టాలీవుడ్‌ ఇప్పటికే ప్రపంచరికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మన దగ్గర అన్ని భాషల సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్‌ ఇక్కడ పెట్టాలంటే హైదరాబాద్‌లో ఆఫీస్‌లు ఉండాలి. ఇకపోతే అల్లు అర్జున్‌, సుకుమార్‌ గతంలో మంచి సందేశాన్ని ఇచ్చే షార్ట్‌ ఫిలిం చేశారు. ఎన్టీఆర్‌, చిరంజీవిలు కూడా చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.