Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్ – హరిహర వీరమల్లు రిలీజ్ మళ్లీ వాయిదా?

Hari Hara Veeramallu Again Postponed?: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటూ రాజకీయాలు, అటూ మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మరో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. దీంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో వీలైనంత త్వరలో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆయ సైన్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్‌ని మెల్లిమెల్లిగా కంప్లీట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. వీటీలో ముందుగా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. ఓజీ దాదాపు 40 శాతం షూటింగ్‌ని జరుపుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజై కేవలం 20 శాతం షూటింగ్‌నే జరుపుకుంది. ‘హరిహర వీరమల్లు’ మాత్రమే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకునే దశకు వచ్చింది. అయితే ఈ సినిమాని మార్చి 28న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటన ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు రెండు పాటలు మాతమ్రే వచ్చాయి. టీజర్, ట్రైలర్‌తో ఇంకా ప్రమోషనల్ కంటెంట్ ఏం రాలేదు.
ప్రమోషన్స్ ఎక్కడా?
రిలీజ్ ఇంకా 20 రోజుల టైం కూడా లేదు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో హడావుడి చేస్తుందనుకుంటే మూవీ టీం సైలెంట్‌గా ఉంది. దీనికి కారణం ఏంటని ఆరా తీయగా.. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో మూవీ రిలీజ్ వాయిదా పడేల కనిపిస్తోంది. చివరి షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ అందుబాలోకి రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొందట. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ మార్చి 28కి ‘హరిహర వీరమల్లు’ రాకపోవచ్చని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మార్చి మిస్ అయితే ఈ మూవీ నెక్ట్స్ కొత్త డేట్ ఎప్పుడనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
కొత్త డేట్ వేటలో నిర్మాత
నిర్మాత ఎఏం రత్నం ప్రస్తుతం మూవీ కొత్త రిలీజ్ డేట్ అన్వేషణలో ఉన్నారు. ఈ సమ్మర్‌కి పలు పెద్ది చిత్రాలు రిలీజ్‌కు ఉన్నాయి. వాటితో క్లాష్ కాకుండా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌ని పరిశీలిస్తున్నారు. అయితే మే 9న హరిహర వీరమల్లును విడుదల చేయాలని ఏఎం రత్నం భావిస్తున్నారట. ఇది చిరంజీవికి అచ్చోచ్చిన డేట్, ఈ డేట్‌కే ‘విశ్వంభర’ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కానీ, మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుంది. మే 9 వరకు విశ్వంభరను రిలీజ్ చేయడం సాధ్యపడేలా లేదు. దీంతో అదే డేట్ హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారట. అంతా సెట్ అయితే అదే తేదీని ఫిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.