Trisha About Marriage: వివాహంపై నమ్మకం లేదు – నాకు అలాంటి పరిస్థితి వద్దు.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్

Trisha Latest Comments on Marriage: స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీఎంట్రీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాలు, పాన్ ఇండియా వంటి ప్రాజెక్ట్స్ ఆమె కెరీర్ దూసుకుపోతుంది. అయితే ఇటీవల అజిత్ సరసన విడాముయర్చి(తెలుగులో పట్టుదల), గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్‌గా విడుదల గుడ్ బ్యాడ్ అగ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన రెండు వారాలకు రూ. 200 కోట్ల గ్రాస్ చేసింది. మరోవైపు త్రిష తెలుగులో విశ్వంభర, తమిళంలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.
థగ్ లైఫ్ తో బిజీ
మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో సుమారు 38 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమే థగ్‌లైఫ్. ఇటీవల ఈ సినిమా చిత్రమిది. ఇందులో త్రిషతో పాటు హీరో శింబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నిర్మాంతర పనులతో పాటు ప్రమోషన్స్ జరుపుకుంటుంది. నిన్న శుక్రవారం ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొంది. కమల్ హాసన్, డైరెక్టర్‌తో పాటు త్రిష కూడా హాజరైంది. ఈ సందర్బంగా త్రిషను ఓ విలేఖరి పెళ్లిపై ప్రశ్నించారు. మూడుమూళ్ల బంధంపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ తనకు వివాహంపై సదుద్దేశం లేదంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.
పెళ్లిపై నమ్మకం లేదు: త్రిష
“నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై నమ్మకం లేదు. నాకు పెళ్లయిన ఒకే, కాకపోయిన ఫర్యాలేదు” అని సమాధానం ఇచ్చింది. ఇక త్రిష ఆన్సర్ విని పక్కనే ఉన్న కమల్ హాసన్ షాక్ అయ్యారు.కాగా గతంలో త్రిష డేటింగ్ వార్తలు, పెళ్లి రూమర్స్ తెగ హల్‌చల్ చేశాయి. టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ హీరోలతో ఆమె డేటింగ్ చేసినట్టు రూమర్స్ వినిపించాయి. అయితే చివరికి అవి ప్రచారానికే పరిమితమయ్యాయి. గతంలో ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కారణమేంటో తెలియదు కానీ, ఆ తర్వాత ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి త్రిష పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా? అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటి పరిస్థితి నాకొద్దు..
అయితే అలాంటి త్రిష ఇచ్చిన సమాధానం షాకిచ్చిందనే చెప్పాలి. పెళ్లిపై నమ్మకం లేదన్న ఆమె.. తాను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు అని చెప్పింది. “ఇప్పటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. అలాగే నా పెళ్లి ఎప్పుడనేది కూడా చెప్పలేను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. కానీ, నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు మాత్రమే పెళ్లి గురించి తప్పుకుండ ఆలోచిస్తాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడే చేసుకుంటాను. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోని చాలామంది అసంతృప్తితో జీవిస్తుంటారు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు” అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం త్రిష కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.