Manchu Manoj Post: ఆయన కొడుకు వచ్చాడని చెప్పు.. అన్న విష్ణుకి కౌంటర్‌గా మంచు మనోజ్ పోస్ట్!

Manchu Manoj Shared Photo With Father Mohan Babu: సుమారు పదేళ్ల తర్వాత మంచు మనోజ్ వెండితెరపై సందడి చేశాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’ ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విజయ్ కనమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్ర రూపొందిన ఈ సినిమా శుక్రవారం(మే 30) థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక మంచు మనోజ్‌కు ఈ చిత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.
సుదీర్ఘ విరామం తర్వాత అతడు నటించిన చిత్రమిది. మనోజ్ రీఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ధమాకా అని చెప్పాలి. మూవీ రిలీజ్ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప ఎట్టాడు. ప్రస్తుతం మంచు ఇంట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన అన్నయ్య విష్ణు రెచ్చగొట్టేలా ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది మోహన్ బాబు తన కొడుకు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్పటి వరకు గుట్టుగా ఉన్న మంచు ఆస్తి గొడవలు రచ్చకెక్కాయి. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీలోని ఎదోక గొడవ జరుగుతూనే ఉంటుంది. అది కాస్తా సోషల్ మీడియాకు కూడా ఎక్కింది. మంచు బ్రదర్స్ పరోక్షంగా ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఇద్దరి మధ్య ట్విటర్ వార్ జరిగింది. ఇటీవల భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివయ్యా అంటే శివుడు రాడు అంటూ తన అన్న విష్ణుకు కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత సారీ చెప్పాడు. మూవీ ప్రమోషనల్ ఇంటర్య్వూలో తన తండ్రిపై తనకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశాడు.
తన తండ్రి కాళ్లకు మొక్కాలని ఉందని, ఆయనను అప్యాయంగా కౌగిలించుకుని ప్రేమ మాట్లాడాలని ఉందన్నాడు. అందరం కలిసి భోజనం చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ ఎమోషల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తన ఫోటో పక్కన తన తండ్రి మోహన్ బాబు ఫోటోను ఎడిట్ చేసి ఓ పోస్ట్ పెట్టాడు. భైరవంలో మనోజ్ లుంగీపై ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ పక్కనే.. మోహన్ బాబు పెద్ద రాయుడు లుక్‌ని జోడించాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తున్నట్టు ఉన్న ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పు” అంటూ ఫైర్ ఎమోజీని జత చేశాడు.
పోస్ట్‌తో తన అన్న మంచు విష్ణుకి మనోజ్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాను ఆయన కొడుకునే… ఆయన నట వారసుడి తానే అన్నట్టుగా ఉంది. చూస్తుంటే ఇది విష్ణును రెచ్చగొట్టేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మనోజ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రమిది కావడం మంచు ఫ్యాన్స్‌కి కూడా ఈ చిత్రం చాలా స్పెషల్‌గా మారింది. తమిళ్ హిట్ మూవీ ‘గరుడన్’కి ఇది రీమేక్. ఇలానే తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ అనే పాన్ ఇండియా మూవీలోనూ మనోజ్ కీ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు మంచు విష్ణు కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత విష్ణు నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది.
View this post on Instagram