Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మరోసారి వాయిదా పడిన ‘హరిహర వీరమల్లు’
Pawan Kalyan Movie Hari Hara Veeramallu Postponed Again: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 12న విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. తాజాగా మూవీ టీమ్ ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా వేసినట్లు టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
‘హరిహర వీరమల్లు మూవీ కోసం ఓపికతో ఉంటున్న ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, సినీ లవర్స్, నమ్మకంతో నిరీక్షిస్తున్న ఫ్యాన్స్‌కు అభినందనలు. అంతకుముందు జూన్ 12న సినిమా విడుదల చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఇంకా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నాం. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఆధారంగా మరింత హై క్వాలిటీతో తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీని కోసం కొంత సమయం తీసుకుంటున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం.’ అని టీం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- Akhil Akkineni Wedding: అట్టహాసంగా టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి.. హాజరైన మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖులు