Gajakesari Yoga In June 2025: జూన్ 24 న గజకేసరి యోగం.. ఈ రాశుల వారి లైఫ్ సెట్ అయ్యే టైం
Gajakesari Yoga on 24th June 2025: అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ గ్రహాల సంచారం వల్ల అనేక శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వీటిలో ఒకటి గజకేసరి యోగం. ఇది గురువు, చంద్రుల సంయోగం ద్వారా ఏర్పడుతుంది. గురువు జ్ఞానానికి కారకం కాగా.. చంద్రుడు మనస్సుకు కారకం కాబట్టి, అన్ని రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కెరీర్‌లో విజయం, ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
వాస్తవానికి.. చంద్రుడు 24 జూన్ 2025న రాత్రి 11:45 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో.. మిథునరాశిలో గురు-చంద్రుల సంయోగం ఉంటుంది. దీని కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం జూన్ 27 వరకు ఉంటుంది. దీని వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదంగా ఉండటుంది. మీకు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే.. అది పరిష్కరించబడుతుంది. మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. గజకేసరి యోగ ప్రభావంతో మీరు వ్యక్తిగత విజయం, మానసిక సంతృప్తిని అనుభవిస్తారు. దానధర్మాలు చేస్తారు. భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా కార్యక్రమం జరిగే అవకాశం కూడా ఉంది.
మిథున రాశి:
గజకేసరి యోగం మీకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. మీ ప్రతిభ ఈ సమయంలో పెరుగుతుంది. యోగ ప్రభావం వల్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆఫీసుల్లో గౌరవం, విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మతపరమైన యాత్రలు చేసే అవకాశం ఉంది. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు.
తులా రాశి:
ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. చాలా కాలంగా కోర్టులో కేసు నడుస్తుంటే.. ఇప్పుడు మీకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ రావచ్చు. ఆఫీసుల్లో మీ ప్రయత్నాలకు ప్రశంస లభిస్తుంది. మీ తల్లికి సంబంధించిన విషయాల గురించి మీరు ఆందోళన చెందుతుంటే.. మీ చింతలు ఇప్పుడు తొలగిపోతాయి. ఈసమయంలో పెట్టుబడి పెట్టడం శుభప్రదం. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.