Last Updated:

Ravi Krishna-Navya Swamy: బిగ్ బాస్ రవికృష్ణ, నవ్వస్వామి పెళ్లి ఈ ఏడాదే? – చెప్పేసిన నటుడు!

Ravi Krishna-Navya Swamy: బిగ్ బాస్ రవికృష్ణ, నవ్వస్వామి పెళ్లి ఈ ఏడాదే? – చెప్పేసిన నటుడు!

Ravi Krishna Birthday Wishes to Rumoured Girlfriend Navya Swamy: బిగ్‌బాస్‌ ఫేం రవికృష్ణ, నటి నవ్వస్వామి ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నోసార్లు కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అంతేకాదు జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఆఫీషియల్‌ ప్రకటించలేదు. కానీ వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, వారి తీరు చూసి వీరిద్దరు ప్రేమపక్షులని ఫిక్స్‌ అయిపోయారు. బుల్లితెరపై భార్యభర్తలు నటించిన వీరిద్దరు ఇక నిజ జీవితంలో ఏడడుగులు ఎప్పుడెప్పుడు వేస్తారా? అని వీరి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏళ్లుగా సీక్రెట్ డేటింగ్?

ఈ క్రమంలో రవికృష్ణ చేసిన ఓ పోస్ట్‌ అందరిని ఆలోచనలో పడేసింది. రవికృష్ణ, నవ్వస్వామి ఇద్దరు జంటగా ఆమె కథ సీరియల్లో నటించారు. ఇందులో వీరిద్దరు భార్యభర్తలుగా కనిపించారు. అప్పటికే కాస్తా పరిచయం ఉన్న వీరు ఈ సీరియల్‌తో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. కానీ, వీరి ప్రేమ వ్యవహరాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఇక ఏ ఈవెంట్‌కి అయినా జంటగా పాల్గొంటూ దోబుచూలాడుతున్నారు. అయితే ఇవాళ నవ్య స్వామి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపుతూ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు రవికృష్ణ.

ఈ ఏడాది పెద్ద విశేషం..

“ఓ… స్వామి హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది ఒక పెద్ద విశేషం ఉండనుంది. అదేంటో నీకు తెలుసు. అలాగే నా కోరిక ఏంటనేది కూడా నీకు తెలుసు…  నన్ను ఎప్పుడూ ఎలా ప్రత్యేకం అనిపించేలా చేయాలో తెలిసిన వ్యక్తికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా ప్రత్యేకం. నా జీవితంలో నువ్వు ఉండటం నిజంగా నా అదృష్టం. ఇంకా ఇలాంటి ఎన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలి. హ్యాపీ బర్త్‌డేస్‌” అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఈ ఏడాది పెద్ద విశేషం ఉండనుందని చెప్పడంతో అంతా వీరి పెళ్లి గురించే అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారా? అందుకే ఇలా హింట్‌ ఇస్తూ అసలు విషయం చెప్పేశాడు! అంటూ నెటిజన్స్‌ సందేహిస్తున్నారు.

బుల్లితెర హీరో నుంచి వెండితెర నటుడిగా..

రవికృష్ణ మొదట సీరియల్‌ నటుడిగా తన కెరీర్‌ మొదలుపెట్టాడు. మొగళీ రేకులు సీరియల్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, సుందరకాండ, ఆమె కథ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. అదే సమయంలో బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. హౌజ్‌ నుంచి బయటకు రాగానే సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. విరుపాక్ష, అనుభవించు రాజా, లవ్‌ మీ, ది బర్త్‌డే బాయ్‌ వంటి సినిమాల్లో సహానటుడిగా కనిపించాడు.

 

View this post on Instagram

 

A post shared by Ravi krishna (@ravikrishna_official)