Akkineni Nagarjuna: శ్రీశైలం మల్లన్న సేవలో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు
Akkineni Nagarjuna Family in Srisailam Mallanna: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
తొలుత నూతన వధూవరులతో కలిసి నాగార్జున కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, నాగ చైతన్య, శోభితలు కూడా తనకు సంబంధించిన ప్రతీ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే వివాహం ఫొటోలను షేర్ చేశారు. తాజాగా, నాగార్జున కూడా నాగ చైతన్య, శోభితల ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నా అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులకు ధన్యవాదములు అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇందులో డియర్ ఫ్రెండ్స్.. ఫ్యామిలీ, ఫ్యాన్స్.. మీరు చూపించే ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలే ఇక్కడి వరకు తీసుకొచ్చాయన్నారు. మీ అండతో ఈ వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ఈ మధురమైన అనుభూతితో మా అందరినీ అర్థం చేసుకున్న మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అభిమానంతో నా హృదయం నిండిపోయిందని నాగార్జున పేర్కొన్నారు.