Published On:

Ye Maya Chesave Re-Release: మళ్లీ వెండితెరపై అలరించబోతున్న చై, సామ్‌.. ‘ఏమాయ చేశావే’ రీ రిలీజ్‌, ఎప్పుడంటే..?

Ye Maya Chesave Re-Release: మళ్లీ వెండితెరపై అలరించబోతున్న చై, సామ్‌.. ‘ఏమాయ చేశావే’ రీ రిలీజ్‌, ఎప్పుడంటే..?

Naga Chaitanya -Samantha’s Ye Maya Chesave Re release on June 18th: మరోసారి వెండితెరపై సమంత, నాగచైతన్యలు సందడి చేయబోతున్నారు. వీరిద్దరి కాంబో వచ్చిన ఫస్ట్‌ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కాగా సమంత వెండితెరకు పరిచయమైన మూవీ ‘ఏమాయ చేశావే’. అక్కినేని హీరో నాగ చైతన్యకు తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన ఈ సినిమా వీరిద్దరికి చాలా ప్రత్యేకమనే విషయం తెలిసిందే. తొలి చిత్రంలో సామ్‌ ఇండస్ట్రీ హిట్‌ అందుకుంది.

 

ఇందులో జెస్సీ పాత్రలో కుర్రకారు మనుసులు కొల్లగొట్టింది. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈసినిమాకు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించారు. కార్తీక్‌, జెస్సీ పాత్రలు అప్పట్లో యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. వెండితెరపై చై-సామ్‌ కెమిస్ట్రీకి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. వీరిద్దరు లవ్‌, రొమాన్స్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. 15 ఏళ్ల క్రితం వచ్చి ఈ సినమా ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. ఈ మూవీలో పాటలు, సీన్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి.

 

యూత్‌ని ఉర్రూతలూగించిన ఈ చిత్రం 15 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమౌతుందని తెలిసి అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. జూలై 18న ఈ చిత్రం మరోసారి పలు థియేటర్లలో రీ రిలీజ్‌ కాబోతోంది. కాగా ఈ సినిమాతోనే నాగ చైతన్య, సమంతలకు తొలిసారి పరిచయం ఏర్పడింది. ఈ చిత్రం టైంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో గ్రాండ్‌గా గోవా వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరిగింది.

 

పెళ్లి తర్వాత నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన వీరి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. అనంతరం 2021లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఈ మాజీ దంపతులకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ అయిన నెటిజన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. వీరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా వారి విడాకుల తర్వాత రీ రిలీజ్‌ అవుతుండటంతో ఈ జంట అభిమానుల్లో ఆసక్తిని నెలకొంది. రియల్‌ లైఫ్‌లో మిస్‌ అయిన వీరి కెమిస్ట్రీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.