Published On:

Mohanlal Counter to Mohan Babu: మీ సినిమాలో విలన్‌గా నటిస్తాను.. ఫస్ట్ షాట్ లోనే చంపేస్తా.. మోహన్‌ బాబు కామెంట్స్‌కి మోహన్‌లాల్‌ కౌంటర్‌

Mohanlal Counter to Mohan Babu: మీ సినిమాలో విలన్‌గా నటిస్తాను.. ఫస్ట్ షాట్ లోనే చంపేస్తా.. మోహన్‌ బాబు కామెంట్స్‌కి మోహన్‌లాల్‌ కౌంటర్‌

Mohanlal Funny Counter to Mohan Babu: మంచు విష్ణు, మోహన్‌ బాబులు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్‌కు ఇంక కొన్ని రోజులే ఉండటంతో వరుస ఇంటర్య్వూలో ఇస్తున్నారు. నిన్న కన్నప్ప ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

 

అయితే నిన్న కొచ్చిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మోహన్‌ లాల్‌ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మోహన్‌ లాల్‌, మోహన్‌ బాబులు మాట్లాడుతుండగా వారిద్దరు సరదాగా మాట్లాడారు. ఇద్దరు మధ్య కాసేపు ఫన్నీ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌ బాబు ఓ పెద్ద కోరికను బయటపెట్టారు. ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పై మోహన్‌ లాల్‌ మాట్లాడుతుండగా.. ఆయన పక్కనే మోహన్‌ బాబు, మంచు విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా మోహన్‌ బాబు చాలా మంచి వ్యక్తి అని, ఆయన చాలా స్వీట్‌ పర్సన్ అన్నారు.

 

ఆ తర్వాత మోహన్‌ బాబుతో.. మీ సినిమాలో నేను విలన్‌గా నటిస్తాను.. మీరే హీరో అన్నారు. దీనికి మోహన్‌ బాబు బదులిస్తూ.. లేదు.. లేదు.. నిజంగానే మీ సినిమాలో ప్రతికథానాయకుడి చేయాలని కోరుకుంటున్నా.. ప్లీజ్‌ నా కోరికని మన్నించండి అంటారు. ఆయన మాటలకు మోహన్‌ లాల్‌ స్పందిస్తూ.. అలా అయితే తొలి సన్నివేశంలోనే నేను మిమ్మల్ని కాల్చి పడేస్తాను అంటారు. అలా ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ సాగింది. మోహల్‌ లాల్‌ అన్న మాటలకు స్టేజ్‌పై ఉన్న మంచు విష్ణుతో పాటు అక్కడ ఉన్నవాంత పడి పడి నవ్వుకున్నారు.

 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అనంతరం మోహన్‌ బాబు పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. మలయాళంలో మోహన్‌ లాల్‌ నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘తుడరుమ్‌’ సినిమాను ‘కన్నప్ప’ అధిగమించాలని తాను కోరుకుంటున్నా అన్నారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ‘కన్నప్ప’కు రావాలని కోరుకుంటున్నట్టు మోహన్‌ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. కాగా మోహన్‌ లాల్‌ నటించిన తుడరుమ్‌ మూవీ ఏప్రిల్‌ చివరిలో విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. రికార్డు వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. కేవలం మలయాళంలోనే ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.