Actress Abhinaya: వరకట్నం వేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు జైలు శిక్ష
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
Actress Abhinaya: వరకట్నం వేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది. అభినయ అన్న శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది.. ఆ సమయంలో కట్నంగా రూ. 80 వేలతో పాటు 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే అభినయతో పాటు ఆమె కుటుంబం మరో లక్ష రూపాయల అదనపు కట్నం తీసుకురమ్మని తనను వేధించడంతో.. లక్ష్మీదేవి 2002లో బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.
ఈ కేసు వాయిదాలు పడుతూ.పదేళ్ల తరువాత అనగా 2012లో తీర్పు వచ్చింది. అప్పట్లో మెజిస్ట్రేట్ కోర్టు జయశ్రీతో పాటు, సోదరుడు శ్రీనివాస్, మరో సోదరుడు , తల్లీ, తండ్రి ఇలా నిందుతులుగా ఉన్న ఐదుగురుకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.. కానీ జిల్లా కోర్టు దీనిపై స్టే విధించింది. ఈ క్రమంలోనే లక్ష్మీ దేవి.. జిల్లా కోర్టు తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు వేసింది. మరో పదేళ్ళ పాటు సాగిన ఈ కేసు తుది తీర్పు ఇప్పుడు వచ్చింది.
అయితే కొన్నేళ్ల క్రితం అభినయ సోదరుడు శ్రీనివాస్, తండ్రి రామకృష్ణ చనిపోగా.. ప్రస్తుతం వచ్చిన హైకోర్టు తుది తీర్పు బ్రతికి ఉన్న ముగ్గురికి వర్తిస్తున్నట్టు వెల్లడించింది. కట్నం వేధింపుల కేసులో నటి అభినయతో పాటు ఆమె తల్లి జయమ్మ, సోదరుడు చెలువకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దర్శకుడు కాశీ విశ్వనాథ్ అనుభ సినిమాతో అభినయ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన అభినయ ప్రస్తుతం సీరియల్స్‌కే పరిమితమైంది.