Keerthy Suresh: ‘రివాల్వర్ రీటా’గా వస్తున్న కీర్తి సురేష్ – రిలీజ్ డేట్ ఫిక్స్
Keerthy Suresh Revolver Rita Locks Release Date: మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్దమైంది. అసలు ఉంటుందో, ఉండదో అనుకున్నారు. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పాటు తెలుగులో ఈ మూవీ విడుదల కానుంది.
తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఆగష్టు 2 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేష్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రెడిన్ కింగ్‌స్లీ, మైమ్‌గోపి, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్‌లు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.