Published On:

Trivikram Srinivas: వెంకటేష్‌, తారక్‌లతో త్రివిక్రమ్‌ సినిమాలు – అధికారికంగా ప్రకటించిన నిర్మాత

Trivikram Srinivas: వెంకటేష్‌, తారక్‌లతో త్రివిక్రమ్‌ సినిమాలు – అధికారికంగా ప్రకటించిన నిర్మాత

Trivikram Next Two Movies With Venkatesh and Jr NTR: ప్రస్తుతం డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన నెక్ట్స్‌ సినిమాలు ఏంటీ? ఏ హీరో చేయబోతున్నారనేది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌తో ఆయన సినిమాలు చేయబోతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్‌ నెక్ట్స్ రామ్‌ చరణ్‌ని లాక్‌ చేసుకున్నారంటూ ఓ వార్త బయటకు వచ్చింది.

 

అయితే అందులో నిజం లేదని నిర్మాత నాగవంశీ ట్వీట్‌తో తేలిపోయింది. నిన్న వరుస ట్వీట్స్‌తో ఈ వార్తలపై ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చాడు. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లో ఇద్దరితో కాదని, తనకు ఎంతో ఇష్టమైన అన్నయ్య అంటూ ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నట్టు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా నాగవంశీ నేరుగా ఎన్టీఆర్‌ పేరునే రివీల్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. “త్రివిక్రమ్‌ నెక్ట్స్‌ రెండు సినిమాలు ఇద్దరు హీరోలతో చేయబోతున్నారు. అందులో విక్టరీ వెంకటేష్‌తో ఒకటి, మరొకటి జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నతో. ఇవి తప్ప ఆయన మరే ప్రాజెక్ట్స్‌ చేయడం లేదు. ఏ హీరోతోనూ సినిమా చేయడం లేదు.

 

ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు అయినా నేను చేస్తాను” అని నాగవంశీ స్పష్టం చేశారు. ఆయన ట్వీట్‌తో త్రివిక్రమ్‌ రామ్‌ చరణ్‌ మూవీ లేదని తేలిపోయింది. అలాగే అల్లు అర్జున్‌తో సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా రూమర్స్‌ మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. మొదటి నుంచి వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడదే నిజమైంది. ఇక ఎన్టీఆర్‌తో కూడా మూవీ ఉంటుందని, ఇదోక మైథాలజికల్‌ ఫాంటసీ డ్రామా గురూజీ ప్లాన్‌ చేశారని నాగవంశీ క్లారిటీ ఇచ్చేసాడు. ఇదే విషయాన్ని ఇవాళ ఆపీషియల్‌ ప్రకటించారు. ఇందులో వెంకటేష్‌ సినిమా మొదట ఉంటుందని తెలుస్తోంది.

 

ఎందుకంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్‌ అనే టైటిల్‌ దీనికి ప్రచారంలో ఉంది. ఇటీవల ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలైంది. మరోవైపు దేవర 2 కూడా చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పట్లో త్రివిక్రమ్‌-తారక్‌ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం లేదు. సో గురూజీ మొదట వెంకటేష్‌ ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ రెండు సినిమాలు కూడా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ రెండు సినిమాలు కూడా పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడి ఉంటుందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్స్‌ సంబంధించిన మరింత సమాచారం కోసం మరికొన్ని రోజులు వెయట్‌ చేయాల్సిందే.