Published On:

Aamir Khan: మహాభారతం తర్వాత రిటైర్మెంట్‌పై స్పందించిన ఆమిర్‌ ఖాన్‌

Aamir Khan: మహాభారతం తర్వాత రిటైర్మెంట్‌పై స్పందించిన ఆమిర్‌ ఖాన్‌

Aamir Khan Reacts His Retirement Rumors: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతంపై ఫుల్‌ ఫోకస్డ్‌గా ఉన్నారు. ఈ సినిమాలో తాను నటించనని, నిర్మిస్తానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ తర్వాత ఆమిర్‌ ఇక రిటైర్మెంట్‌ తీసుకుంటారని, ఇదే ఆయన చివరి చిత్రమంటూ బి-టౌన్‌లో ప్రచారం జరుగుతుంది. దీనిపై మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి.

 

ఆయన నటించిన చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఛానల్‌తో ఆయన ముచ్చటించారు.  ఈ సందర్భంగా తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. “నా మాటలను అంత తప్పుగా అర్థం చేసుకున్నారు. మహాభారతం నా చివరి సినిమా కాదు. నా సమాధాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘మీరు ఏదైన సినిమా తర్వాత నటనకు బ్రేక్‌ ఇవ్వనున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు.. నన్ను సంతృప్తినిచ్చే పాత్ర దొరికి ఇక చాలు అనుకున్నప్పుడు తప్పకుండ రిటైర్‌మెంట్‌ తీసుకుంటాననని చెప్పాను.  దానికి అంత అదీ మహాభారతం సినిమా అని అపోహపడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఇక నేను నటించనని భావిస్తున్నారు.

 

అలా నా సమాధానాన్ని అంత తప్పుగా అర్థం చేసుకున్నారు” అని చెప్పుకొచ్చరు. అయితే ఒక కళాకారుడిగా తనన్ను సంతృప్తిపరిచే పాత్రలు చేయడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని, అప్పటి వరకు నటిస్తూనే ఉంటానని ఆమీర్‌ స్పష్టం చేశారు. మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందించాలనేది తన కోరిక అని, నేటితరం ప్రేక్షకులకు దానిని అందించాలంటే భారీ స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉందన్నారు. “చాలా కాలం నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. వెండితెరపై దీనిని ఓ అద్భుతంగా ప్రేక్షకులను చూపించాలనేది నా కల. అయితే ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా చేయడానికి ఇక ఏమి లేదనే భావన నాకు కలుగుతుంది. కానీ, ఒక నటుడిగానే నాకు చనిపోవాలని ఉంది” అంటూ ఆమిర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చారు.