Published On:

Thammudu Trailer:నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు.. ఆకట్టుకుంటున్న నితిన్‌ ‘తమ్ముడు’ ట్రైలర్‌

Thammudu Trailer:నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు.. ఆకట్టుకుంటున్న నితిన్‌ ‘తమ్ముడు’ ట్రైలర్‌

Thammudu Movie Official Trailer: హీరో నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్‌ నటి లయ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎంతోకాలం తర్వాత ఆమె రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా ఈ సినిమా జూలై 4న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది.

 

దీంతో ఈ సినిమా కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్క సెంటిమెంట్‌.. ఫ్యాన్‌ బాయ్‌ నితిన్‌ పవన్‌ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌తో వస్తుండటంతో ‘తమ్ముడు’పై మంచి బజ్‌ క్రియేట్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో మూవీ టీం తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ సినిమా కథ అని తాజాగా రిలీజైన ట్రైలర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది.

 

‘మీ అక్కను చూశావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది.. కానీ, క్యారెక్టర్‌ మాత్రం లూస్‌ అవ్వలేదు’ హీరోయిన్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది.. ఇప్పుడా ఆ మాట నిలబెట్ట టైం వచ్చింది.. నిలబెడత’ అనే నితిన్‌ డైలాగ్‌ ఆకట్టుకుంది. చూస్తుంటే తమ్ముడు ఫ్యామిలీ, యాక్షన్‌ మూవీ అని తెలుస్తోంది. ఫ్యామిలీ, యాక్షన్‌కి మైథలాజికల్‌ టచ్‌ ఇచ్చాడు డైరెక్టర్‌.

 

ట్రైలర్‌ నితిన్‌ యాక్షన్‌ బాగా ఆకట్టుకుటుంది. ఇక చివరిలో ‘మాట పోయి మినిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క’ అనే డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. చివరిలోఅక్క-తమ్ముళ్లుగా నితిన్‌, లయల బాండింగ్‌ హత్తుకుంది. ప్రస్తుతం తమ్ముడు ట్రైలర్‌ మూవీ మరిన్ని అంచనాలు పెంచేసింది. వరుస ప్లాప్స్‌తో భారీ హిట్‌ కోసం చూస్తున్న నితిన్‌కు ఈ మూవీ ఫలితాన్ని ఇస్తుందనేది ఆసక్తికిన సంతరించుకుంది. ఇందులో సౌరభ్‌ సచ్‌దేవా, హరి తేజ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, టెంపర్‌ వంశీ, చమ్మక్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: