Yamadonga Re Release Trailer: తారక్ బర్త్‌డే ట్రీట్, మరోసారి థియేటర్లకు ‘యమదొంగ’ – రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

Yamadonga Re Release Trailer Out: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఏ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందాని అని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్ 2, దేవర 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డ్రాగన్'(ప్రచారంలో ఉన్న టైటిల్). వీటికి నుంచి వచ్చే అప్‌డేట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయి, ఈ సారి తారక్ అభిమానులకు పండగే పండగ అంటున్నారు.
మరోవైపు ఆయన బర్త్‌డే సందర్భంగా తారక్ సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మే 18న ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ ఒక్కరోజే కాదు మరో రెండు అంటే మూడు రోజుల పాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా ‘యమదొంగ’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది.
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రియమణి, మమతా మోహన్ దాస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇందలోఉ ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇందులో యమధర్మ రాజు పాత్రలో తనదైన నటనతో తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు తారక్. అప్పుడు, ఇప్పుడు పాటలో సీనియర్ ఎన్టీఆర్‌ను గ్రాఫిక్స్ ద్వారా ఈ పాటలో చూపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నందమూరి అభిమానులకు మరింత స్పెషల్ అనడంలో సందేహం లేదు.
అయితే ఈ సినిమాను 8k ప్రింట్‌తో విడుదల చేస్తున్నట్టు టాక్. భవిష్యత్తులో కూడా యమదొంగను సినిమాను మళ్లీ మళ్లీ ఎలాంటి ఎడింగ్‌లు లేకుండ విడుదల చేసేందుకు అనువుగా ఇప్పుడే ఈ చిత్రాన్ని అడ్వాన్డ్ టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను 8k ప్రింట్‌లో రీస్టోర్ చేస్తున్నారట. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాను 4కే ప్రింట్‌తోనే ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోస్ వేయనున్నారట. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని సెలక్టడ్ థియేటర్లలో ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారట. రమా రాజమౌళి సమర్పణలో విశ్వామిత్ర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాయి.