Ajith Kumar: అప్పు తీర్చడానికే నటుడిని అయ్యాను – అజిత్ షాకింగ్ కామెంట్స్

Ajith Kumar Took Up Acting for Pay Debts: హీరో అజిత్ క్రేజ్ గురించి తెలిసిందే. తమిళంలో అగ్రనటుడైన అజిత్‌కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనను అభిమానులు తల అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల తన పేరుకు ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దని, అజిత్ అంటే చాలు అని ఈ గుర్తింపు సింపుల్‌గా తిరస్కరించాడు. సినిమాలు, ఫ్యామిలీ తప్పిదే ఆయన ఏ విషయంలో పెద్దగా కలగజేసుకోరారు. తన ఫ్యామిలీ లైఫ్‌ని చాలా గొప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇటీవల పద్మ భూషణ్ అవార్డు తీసుకున్న అజిత్ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు తన ఇండస్ట్రీలో ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. తాను పెద్ద స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేని, అప్పులు తీర్చుకోవడం కోసమే వచ్చానని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడ అనుకోలేదు. మొదట ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. దానితో పాటు ఆటోమొబైల్ కంపెనీలో వర్క్ చేశా. అక్కడ వర్క్ చేస్తూనే రేసింగ్ ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు మాత్రమే. రేసింగ్ అంటే ఆసక్తి అని ఇంట్లో చెప్పాను. అప్పుడు వారు ‘స్పోర్ట్స్ కార్లు, బైక్స్ చాలా ఖరీదైనవి. అవి కొనేంత స్థోమత మనకు లేదు. ఈ విషయంలో మేము నీకు ఎలాంటి సాయం చేయలేము.
అలా అని నీ ఆసక్తిని కాదనలేము. నీకు కావాల్సిన దాన్ని నువ్వే సమకూర్చుకో’ అని అన్నారు. దాని కోసం అప్పు చేసి రేసింగ్‌లోకి వచ్చాను. అలా ఓసారి రేసింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మోడలింగ్‌లో ట్రై చేయమని సలహా ఇచ్చాడు. అతడు సూచన మేరకు నేను మోడలింగ్ ప్రారంభించాను. అదే టైంలో నాకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి” అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత “మొదట నాకు ఓ తెలుగు సినిమాకు ఆడిషన్ ఇవ్వాలని పిలుపు వచ్చింది. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులకు చెబితే వారు చాలా కంగారు పడ్డారు. మన ఫ్యామిలీ ఇప్పటి వరకు ఎవరూ సినిమారంగంలో లేరన్నారు. వారికి సర్థి చెప్పి సినిమాల్లోకి వచ్చాను. నాకు అప్పుడు తెలుగు సరిగా మాట్లాడటం వచ్చేది కాదు. అయినా ప్రయత్నించి తెలుగు నేర్చుకున్నాను. అలా అనుకోకుండ నటుడిని అయ్యాను.
నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ ఇక్కడికి నేను ఏదో స్టార్ అవ్వాలని రాలేదు. నా అప్పుడు తీర్చుకోవచ్చని సినిమాల్లోకి వచ్చాను. ఇదే విషయాన్ని ఓ ఇంటర్య్వూలో చెప్పాను. ‘సినిమాల్లోకి రాకముందు ఓ వ్యాపారాన్ని ప్రారంభించాను. అందులో నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాను. అవి తీర్చడమే కోసమే పరిశ్రమలోకి వచ్చాను’ అని చెప్పా. అయితే డబ్బు కోసమే ఇక్కడకు వచ్చారా? అని తిరిగి ప్రశ్నించారు. దానికి ‘తీసుకున్న అప్పు ఎలాంటి కష్టమైన పని అయిన చేసి తీర్చాలనేది నా అభిప్రాయం. అందుకే నాకు తెలియని రంగంలోకి వచ్చి కష్టపడుతున్నాను. దీనికి మీరు నన్ను అభినందించాలి’ అని అన్నాను. అయినా ఆడిషన్‌లో నా ప్రతిభ చూపించాను కాబట్టే నన్ను సెలక్ట్ చేసుకున్నారు” అని అజిత్ తన సినీ జర్నీని గుర్తు చేసుకున్నారు.