Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది – వినాలి.. మాట చెప్తే వినాలంటున్న పవర్ స్టార్
Hari Hara Veeramallu Maata Vinaali Song Out: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చిలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో దీంతో మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌తో వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీం. స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
“వినాలి.. వీరమల్లు మాట చేప్తే వినాలి” అంటూ తెలంగాణ యాసలో ఈ పాట సాగింది. ఆటవి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాట ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహిత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ తన గాత్రాన్ని అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ డియోల్ ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. అణాగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడుగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు.