Samsung Galaxy S25 Edge Delivery: సర్ ప్రైజ్ చేసిన సామ్సంగ్.. సన్నిని గెలాక్సీ S25 ఎడ్జ్.. ఒక్కసారిగా డెలివరీలు స్టార్ట్!

Samsung Galaxy S25 Edge Early Delivery: టెక్ మేకర్ సామ్సంగ్ ఈ నెల ప్రారంభంలో గెలాక్సీ S సిరీస్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S25 Edgeని ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు దక్షిణ కొరియా బ్రాండ్ ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు గెలాక్సీ S25 ఎడ్జ్ ముందస్తు డెలివరీలను ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు అధికారిక సేల్ తేదీకి ముందే స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు. గెలాక్సీ S25 ఎడ్జ్ మందం 5.8మి.మీ. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి 200-మెగాపిక్సెల్ ప్రైమరీ వెనుక కెమెరా ఉంది.
Samsung Galaxy S25 Edge Pre-Order Benefits
భారతదేశంలో సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ కోసం ముందస్తు డెలివరీలను కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముందస్తు ఆర్డర్ చేసిన కస్టమర్లు ముందస్తు డెలివరీకి అర్హులు. ఈ హ్యాండ్సెట్ కోసం సామ్సంగ్ మే 30 వరకు ప్రీ-ఆర్డర్లను అంగీకరిస్తుంది.
Samsung Galaxy S25 Edge Offers
సామ్సంగ్ రూ. 12,000 స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను అందిస్తోంది, దీని ద్వారా కస్టమర్లు 256GB స్టోరేజ్ మోడల్ ధరకే 512GB స్టోరేజ్ వేరియంట్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొనుగోలుదారులు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌ను కూడా పొందచ్చు.
Samsung Galaxy S25 Edge Price
సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.1,09,999.12జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,21,999గా ఉంచారు. ఇది టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Samsung Galaxy S25 Edge Features
సామ్సంగ్ భారతదేశంలోని నోయిడా ఫ్యాక్టరీలో గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌ను తయారు చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారంగా One UI 7పై పనిచేస్తుంది. 6.7-అంగుళాల క్వాడ్-HD+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటక్షన్ అందించారు. ఇది గెలాక్సీ కోసం కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది.
Samsung Galaxy S25 Edge Camera
సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్,12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి 12-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా అందించారు. గెలాక్సీ S25 సిరీస్‌లోని ఈ సన్నని హ్యాండ్‌సెట్‌లో 3,900mAh బ్యాటరీ ఉంది. ఇది 25W వైర్డు, క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. IP68-రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Motorola Edge 2025 Launched: అసలు ఊహించలేదు భయ్యా.. మోటో మిలటరీ గ్రేడ్ ఫోన్.. బిల్డ్ క్వాలిటీ సూపర్!