Sreeleela: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ – కన్ఫాం చేసిన హీరో తల్లి!

Kartik Aaryan, Sreeleel Dating Rumours Confirms Hero Mother:యంగ్ సెన్సేషన్ శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ డేటింగ్లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పటి వీరిద్దరి రిలేషన్లో బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కార్తిక్ ఫ్యామిలీ ఫంక్షన్లో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా కార్తిక్ తల్లి చేసిన కామెంట్స్ ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోశాయి.
వైద్యురాలు కోడలుగా రావాలి..
ఇటీవల రాజస్థాన్ జైపూర్ వేదికగా జరిగిన జరిగిన ఐఫా అవార్డు వేడుకలకు కార్తిక్ ఆర్యన్‌తో పాటు అతడి తల్లి కూడా హాజరైంది. భూల్ భూలయా 3 మూవీకి గానూ ఉత్తమ నటుడిగా కార్తిక్‌ను ఈ అవార్డు వరించింది. ఈ వేడుకలో కార్తిక్ అవార్డు అందుకున్న అనంతరం బాలీవుడ్ దర్శక-నిర్మాత కార్తిక్ తల్లిని ఓ ప్రశ్న అడిగారు. మీకు ఎలాంటి కోడలు కావాలని అనుకుంటున్నారు అని అడగ్గా.. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని తామంత కోరుకుంటున్నామని చెప్పింది.
దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ రూమర్స్ చర్చనీయాంశం అవుతున్న తరుణంలో ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. ఎందుకంటే శ్రీలీల కూడా వైద్య విద్యార్థిని అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే కూడా వైద్యురాలు అయితే బాగుంటుందనే ఆమె కామెంట్స్ శ్రీలీలను ఉద్దేశించే ఉన్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు. సౌత్‌లో శ్రీలీల స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ..
ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హిందీలో ఆమె ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ సెట్లోనే కార్తిక్, శ్రీలీల మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరు బీ-టౌన్లో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇటీవల కార్తిక్ ఫ్యామిలీ ఫంక్షన్లోనూ ఆమె కనిపించడంతో వీటికి మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటి వరకు వారి డేటింగ్ వార్తలపై శ్రీలీల, కార్తిక్ కానీ స్పందించకపోవడం గమనార్హం.