Published On:

Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం.. మంగ్లీపై కేసు

Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం.. మంగ్లీపై కేసు

Ganja and Foreign Liquor in Mangli Birthday Party: సింగర్‌ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఆమె పుట్టిన రోజు వేడుకలో గంజాయి కలకలం రేపింది. కాగా తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులు, సన్నిహితులుగా ఓ రిసార్ట్‌లో పార్టీ నిర్వహించింది. ఈ బర్త్‌ డే పార్టీపై దాడి చేసిన పోలీసులు గంజాయ్‌, విదేశీ మద్యం వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పార్టీకి వచ్చిన కొందరు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో సింగర్‌ మంగ్లీతో పాటు రిసార్ట్‌ ఓనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు.

 

ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. కాగా మంగళవారం మంగ్లీ బర్త్‌డే. ఈ సందర్భంగా చేవేళ్ల త్రిపుర రిస్టార్ట్‌లో తన బర్త్‌డే పార్టీని జరుపుకుంది. ఈ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులకు చేవేళ్లలోనే రిస్టార్ట్‌లో బర్త్‌డే పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సుమారు 50 మందికి పైగా హాజరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్‌పై దాడి నిర్వహించారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలిసింది. దీంతో పోలీసులు మంగ్లీపై కేసు నమోదు చేశారు. అలాగే అనుమతి లేకుండ పార్టీ కోసం రిస్టార్ట్‌ ఇచ్చిన త్రిపుర రిస్టార్ట్‌ ఓనర్‌పై కూడా కేసు నమోదు చేశారు.