Bellamkonda Sreenivas: రాంగ్ రూట్.. పోలీసులకు దొరికిన బెల్లంకొండ హీరో

Bellamkonda Sreenivas: ఎంత సెలబ్రిటీలు అయినా వారు మనుషులే. వాళ్లు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్లు మద్యం తాగుటూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. యాక్సిడెంట్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఒక చిన్న తప్పు చేసి ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు.
సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అందుకే కొందరు త్వరగా వెళ్లాలని రాంగ్ రూట్ లో వెళ్తుంటారు. ట్రాఫిక్ పోలీస్ కంటపడనంతవరకు ఓకే కానీ, ఒక్కసారి పోలీస్ కంటపడ్డారా.. ? అంతే సంగతి. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కున్నాడు బెల్లంకొండ హీరో. శ్రీనివాస్.. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ వద్ద తన కారులో రాంగ్ రూట్ లో వెళ్తూ ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు.
ఫుల్ స్పీడ్ తో అతనిపైకే కారును దూసుకుపోయాడు. వెంటనే కారును ఆపిన సదురు ట్రాఫిక్ పోలీస్.. సెలబ్రిటీ కదా అని వదిలేయలేదు. రాంగ్ రూట్ లో వచ్చినందుకు ట్రాఫిక్ పోలీస్ .. శ్రీనివాస్ ను నిలదీశాడు. ఎందుకు వచ్చావని కడిగిపడేశాడు. వెనక్కి వెళ్లి రైట్ రూట్ లో వెళ్లమని చెప్పడంతో సైలెంట్ గా శ్రీనివాస్ తన కారును వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన నటించిన భైరవం మే 30 న రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఇంకో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో విజయాలను అందుకుంటాడో లేదో చూడాలి.