Published On:

Bhairavam: సెట్ లో నలభీములుగా మారిన హీరోలు.. వీడియో వైరల్

Bhairavam: సెట్ లో నలభీములుగా మారిన హీరోలు.. వీడియో వైరల్

Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 30 న రిలీజ్ కానుంది.

 

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. సినిమాకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా సెట్ లో హీరోలు నలభీములుగా మారి గరిటె పట్టారు. బిగ్ యాక్షన్ బ్లాగ్ ప్లాన్ చేస్తున్న సమయంలో హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్.. డైరెక్టర్ తో పాటు సెట్స్ లో ఉన్నవారందరికీ షాక్ ఇచ్చారు.

 

సెట్ లో ఉన్నవారందరి కోసం ఈ కుర్ర హీరోలు గరిటె పట్టారు. నారా రోహిత్ బిర్యానీ చేయగా.. మనోజ్ చికెన్ కర్రీ చేసినట్లు వీడియోలో చూపించారు. ఇక హీరోల వంటల గురించి హీరోయిన్స్ అద్భుతంగా రివ్యూ ఇచ్చారు. ఫుడ్ అంతా సూపర్ గా చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

భైరవం  సినిమాపై అభిమానులు మంచి అంచనాలనే పెట్టుకున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అందులోనూ మనోజ్ రీఎంట్రీ ఈ సినిమాతోనే ఇస్తున్నాడు.  మరి ఈ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి: