Published On:

Bellamkonda Sai Srinivas: రాంగ్‌ రూట్‌లో కారు నడిపిన టాలీవుడ్‌ హీరో – ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నించడంతో..

Bellamkonda Sai Srinivas: రాంగ్‌ రూట్‌లో కారు నడిపిన టాలీవుడ్‌ హీరో – ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రశ్నించడంతో..

Bellamkonda Sai Srinivas Breaks Traffic Rules: టాలీవుడ్‌ హీరో, అగ్ర నిర్మాత కొడుకు ట్రాఫిక్‌ రూల్స్‌ అధిగమించి పోలీసులకు చిక్కాడు. అది గమించిన కానిస్టేబుల్‌ వారించడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంతకి ఆ తెలుగు హీరో ఎవరా అనుకుంటున్నారా? బెల్లకొండ సాయి శ్రీనివాస్‌. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ బాబు తనయుడే బెల్లికొండ సాయి శ్రీనివాస్‌. ఈ హీరో వెండితెరపై కనిపించ చాలా కాలం అవుతోంది. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు.

 

ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్‌ వంటి చిత్రాల్లో నటించాడు. ఎంట్రీతో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరోకి ప్లాప్స్‌ ఎదురయ్యాయి. దీంతో ఆయన కెరీర్‌ స్లో అయిపోయింది. దీంతో సినిమాలు కూడా తగ్గిపోయయి. ప్రస్తుతం లాంగ్‌ గ్యాప్‌ తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు సాయి శ్రీనివాస్‌. తాజాగా మూవీ ప్రమోషన్స్‌ పాల్గొని తిరిగి వెళుతున్న అతడు రాంగ్‌ రూట్‌లో వెళ్లాడు.

 

హైదరాబాద్‌లోని జూబ్లిహిట్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ దగ్గర రాంగ్‌ రూట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ రాంగ్‌ రూట్‌లో వెళుతూ కనిపించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. సదరు హీరోని ప్రశ్నించాడు. దీంతో ఈ బెల్లంకోడ హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైలర్‌ అవుతోంది. ఇక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీ అని కూడా చూడకుండ తప్పు చేసిన హీరోని నిలదీసి తన విధిని నిర్వర్తించాడంటూ పలువురు కొనియాడుతున్నారు. కాగా సాయి శ్రీనివాసం భైరవం మూవీతో పాటు కిష్కిందపురి, టైసన్‌ నాయుడు, హైందవ సినిమాలు చేస్తున్నాడు. రీఎంట్రీలో వరుసగా నాలుగు సినిమాలో లైన్‌లో ఫుల్‌ దూకుడు మీద ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: