Home / Traffic Rules
Traffic Rules: ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విధించే చలాన్లను తప్పించుకునేందుకు కొందరు వివిధ మార్గాలను అనుసరిస్తారు. కొందరు వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా.. మరి కొందరు వాహనాల నెంబర్ కనిపించకుండా చేస్తారు.
భాగ్యనగరంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీలో ప్రజలకు అలర్ట్. రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.