Published On:

Free Amazon Prime Subscription: ఎవరికీ చెప్పకు.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఎలానో తెలుసా?

Free Amazon Prime Subscription: ఎవరికీ చెప్పకు.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఎలానో తెలుసా?

Free Amazon Prime Subscription with VI Plans: భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా (Vi), తన వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మీరు OTT కంటెంట్‌, మొబైల్ రీఛార్జ్‌తో అదనపు ప్రయోజనాలను కోరుకుంటే, ఈ ప్లాన్‌లు మీకు సరిపోతుంది. 996, 3799 రూపాయల రీఛార్జ్‌లపై Vi నుండి ఉచిత OTT బెనిఫిట్స్ అందిస్తుంది.

 

Vodafone Idea Rs.996 Prepaid Plan

వొడాఫోన్ ఐడియా రూ. 996 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. 2GB రోజువారీ డేటాతో పాటు, ఇది అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లను పంవచ్చు. దీనితో పాటు, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజుల పాటు అందిస్తున్నారు.

 

దీనితో పాటు, హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు, వీటిలో అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు బింగే ఆల్ నైట్‌తో అపరిమిత డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్‌తో వారంలోని మిగిలిన డేటాను వారాంతంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదనంగా, డేటా డిలైట్స్‌తో అదనపు డేటా కూడా అందుబాటులో ఉంది.

 

Vodafone Idea Rs.3799 Prepaid Plan

ఏడాది పొడవునా రీఛార్జ్ ఒత్తిడి నుండి విముక్తి పొందాలనుకునే వినియోగదారులకు ఈ వార్షిక ప్లాన్ ఉత్తమమైనది. ఇది 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లను దిస్తుంది. ఈ ప్లాన్ 1 సంవత్సరం (365 రోజులు) పాటు అమెజాన్ ప్రైమ్ లైట్, ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది.

 

Free OTT for Just Rs.100

ఇది మునుపటి ప్లాన్ లాగానే హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది, వీటిలో బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌లలో రోజువారీ డేటా లిమిటెడ్ అయిపోయినప్పుడు, వేగం 64 Kbpsకి తగ్గుతుంది. అదే సమయంలో మీరు 5G కవరేజ్ ప్రాంతంలో ఉంటే, మీరు గొప్ప హై-స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని పొందచ్చు.