Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్!
Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 వరకు సాగనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు.
పంజాబ్ లోని లూథియానాలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణించగా ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాళీగంజ్ లో తృణముల్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణించారు. దీంతో ఆయన కుమార్తెను అధికార పార్టీ బరిలో నిలిపింది. గుజరాత్ లో కాడి బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ భాయ్ సోలంకీ మరణంతో ఉపఎన్నిక జరగుతోంది. అలాగే విసవడర్ లో ఆప్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే భూపేంద్ర భాయ్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతోంది. ఇక కేరళలోని నీలాంబర్ స్థానానికి కూడా ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన పీవీ అన్వర్ తన పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా జూన్ 23న ఉపఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.