9 Dead in Pune Accident: పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
9 People Died in Pune Accident: మహారాష్ట్ర లోని పూణె జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేజూరి- మోర్గాన్ హైవేపై టెంపోను కార్ ఢీకొంది. ప్రమాదంలో ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు చేరుకుని క్షతగాత్రులను జేజూరిలోని శాంతాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రహదారి పక్కన టెంపోను ఆపి రిఫ్రిజిరేటర్ ను దింపుతుండగా.. వేగంగా వచ్చిన కారు.. టెంపోను ఢీకొట్టింది. ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన నలుగురులో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సోమనాథ్ రామచంద్ర, రాము సంజీవని యాదవ్, అక్షయ్ కుమార్ చవాన్, అజిత్ అశోక జాదవ్, కిరణ్ భరత్ రౌత్, అశ్విని సంతోష్, అక్షయ్ రౌత్ గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఘటనపై వివరాలు ఆరా తీస్తున్నారు.