Published On:

Anupama Parameswaran-Dhruv Vikram: విక్రమ్‌ కొడుకుతో అనుపమ డేటింగ్‌ – వారిద్దరి ప్రైవేట్‌ ఫోటో లీక్‌!

Anupama Parameswaran-Dhruv Vikram: విక్రమ్‌ కొడుకుతో అనుపమ డేటింగ్‌ – వారిద్దరి ప్రైవేట్‌ ఫోటో లీక్‌!

Anupama Parameswaran and Dhruv Vikram Lip Kiss Photos Viral: హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ యంగ్‌ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికి సంబంధించి ఓ ప్రైవేట్‌ ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకి అనుపమ ప్రేమలో పడిన ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ విక్రమ్. అనుపమ, ధ్రువ్‌లు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ కొద్ది రోజులు వార్తలు వస్తున్నాయి.

 

పార్టీలో లిప్ కిస్!

ప్రస్తుతం వారిద్దరు కలిసి ‘బైసన్‌’ అనే మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఈ జంట నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, తాజాగా వైరల్‌ అవుతన్న ఫోటో చూసి అంతా వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్‌ అయిపోతున్నారు. ఇందులో అనుపమ, ధ్రువ్‌ లిప్‌ కిస్‌ పెట్టుకుంటూ కనిపించారు. ఇది ఓ పార్టీలో తీసుకున్న ఫోటోలా కనిపిస్తోంది. అయితే ఇది స్పోర్టిఫైలోని ఇద్దరి ప్లే లిస్ట్ లో ఈ ఫోటో కనిపంచడంతో నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇది స్క్రిన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

బైసన్ లో జంటగా..

అయిందే ఇది వారి సినిమాలోని ఫోటో అయ్యింటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ జంట మరోసారి డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో నిలుచుకున్నారు. ఇది తెలిసి వీరి ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే బాగుండని, వీరద్దరి పెయిర్‌ చాలా అందంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బైసన్‌’ సినిమాలో ధ్రువ్‌ కబడ్డి ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇందులో అనుపమ అతడి ప్రియురాలి పాత్రలో నటిస్తోంది. అనుమది కేరళనే అనే విషయం తెలిసిందే. ‘ప్రేమమ్‌’ అనే మలయాళ చిత్రంలో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.

 

అనుపమ, ధ్రువ్ సినిమాలు

ఇందులో తన అందం, అభినయంతో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆ.. ఆ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో గడుసు అమ్మాయి పాత్రలో నటించిన మెప్పించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. గతేడాది ఆమె నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇందులో లిల్లి పాత్రలో అనుపమ ఫుల్‌ గ్లామర్‌ షో చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఇక ధ్రువ్‌ విషయానికి వస్తే అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం బైసన్‌ చిత్రంతో పాటు తన తండ్రి విక్రమ్‌తో కలిసి ‘మహాన్‌’ సినిమాలో నటిస్తున్నాడు.