Amy Jackson: మరోసారి తల్లయిన హీరోయిన్ – పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

Amy Jackson and Ed Westwick welcome baby boy: హీరోయిన్ అమీ జాక్సన్ గుడ్‌న్యూస్ చెప్పింది. మరోసారి ఆమె తల్లయ్యినట్టు తెలిపింది. గతేడాది హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ పెళ్లాడిన ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి కూడా మగబిడ్డకు పుట్టినట్టు సోషల్ మీడియాలో వేదికగా ఈ శుభవార్తను అభిమానులు, ఫాలోవర్స్‌తో పంచుకుంది. కాగా 2019లో జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడినట్టు ప్రకటించింది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటానే సహాజీవనం చేశారు.
అప్పుడు వారి ప్రేమకు గుర్తుగా ఆండ్రూ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా అన్యోన్యంగా ఉన్న వీరు అనుకోకుండా విడిపోయారు, ఆ తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను నటి అమీ జాక్సన్ ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరు గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీ వీరి పెళ్లి వేడుకగా ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ దంపతులు మగబిడ్డ పుట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాబు ఆస్కార్ అలెగ్జాండర్ అని నామకరణం చేసినట్టు అమీ జాక్సన్ తెలిపింది.
ఎవడు, ఐ, రోబో 2.0 వంటి చిత్రాలతో సౌత్ దక్షిణాది పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. ఐ సినిమాలో హీరోయిన్‌గా నటించి సౌత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. నటి కెరీర్ ఫుల్ పీక్స్‌లో ఉండగానే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగితేలింది. అతడితో సహాజీవనంలో ఉండగానే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఏడాది తర్వాత బాబును పరిచయం చేసిన అమీ జాక్సన్ 2020లో జార్జ్ పనియోటౌతో ఏడడుగులు వేయబోతున్నట్టు తెలిపింది.
అదే టైంలో కరోనా రావడంతో వారి పెళ్లి వాయిదా పడింది. ఇక ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పింది అమీ. పెళ్లి చేసుకుంటారని అనుకున్న ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాకిచ్చింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడ్డ ఆమె 2024లో అతడితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది నటుడితో బిడ్డకు జన్మనిచ్చింది.
View this post on Instagram