Subodh Kumar Arrested: యూకో బ్యాంక్ కుంభకోణం.. మాజీ సీఎండీ అరెస్ట్

UCO Bank Former CMD Subodh Kumar Arrested by ED: యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రూ. 6210 కోట్ల మేర జరిగిన భారీ కుంభకోణంలో గోయెల్ పాత్రపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే యూకో బ్యాంక్ తో సహా పలు బ్యాంకులు కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటిడ్ కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కంపెనీకి సుబోధ్ కుమార్ వడ్డీ లేకండా రుణాలు ఇప్పించారని అరెస్ట్ చేశారు.
కాగా వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేసినందుకు గోయల్, ఆయన కుటుంబానికి చెందిన షెల్ కంపెనీల్లోకి భారీగా నిధులు బదిలీ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గోయల్ ను అరెస్ట్ చేసి ఈనెల 17న పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు ఈనెల 21వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. అనంతరం ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.