Published On:

Akhil Akkineni Wedding: అట్టహాసంగా టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి.. హాజరైన మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖులు

Akhil Akkineni Wedding: అట్టహాసంగా టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి.. హాజరైన మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖులు

Akhil Akkineni And Zainab Ravdjee’s Wedding: నాగార్జున అక్కినేని చిన్న తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీను శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత దంపతులు దగ్గరుండి వివాహం జరిపించారు. దీంతో అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తాజాగా, వివాహానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

 

ఈ వెడ్డింగ్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన, శర్వానంద్, ప్రశాంత్ నీల్, తదితర సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 8వ తేదీన సెలబ్రిటీలందరికీ రిసెస్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, బిజినెస్ వ్యాపారులు హాజరుకానున్నారు. కాగా, అఖిల్, జైనబ్‌ నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరగగా.. అదే సమయంలో నాగచైతన్య, శోభితల వివాహం ఉండడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. దీంతో నాగచైతన్య, శోభితలు డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

 

ఇదిలా ఉండగా, జైనబ్ రవ్జీ.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆమె ఓ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. గతంలో హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో జైనబ్ వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించారు. అంతేకాకుండా మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ మూవీలో ఓ చిన్న రోల్‌గా నటించారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలో బిజినెస్ టైకూన్ అంటారు.