Published On:

Kuberaa @Rs 100 Crore: ‘కుబేర’ రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు..టీమ్‌ అధికారిక ప్రకటన!

Kuberaa @Rs 100 Crore: ‘కుబేర’ రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు..టీమ్‌ అధికారిక ప్రకటన!

Kuberaa Crossed Rs 100 Crore Gross Collections: ధనుష్‌, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘కుబేర’. ఈ నెల 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ వసూళ్లపై తాజాగా టీమ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసినట్లు తెలిపింది. తమ మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రపంచంలోనే ఖరీదైన ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే ఓ నిరుపేదవాడికి మధ్య జరిగే సన్నివేశంగా ఈ మూవీని రూపొందించారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. దేవా పాత్రలో ధనుష్‌, దీపక్‌గా నాగార్జున నటించారు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భిక్షగాడు పాత్రలో ధనుష్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. సుమారు 3 గంటలకు పైగా రన్‌టైమ్‌తో ఈ మూవీ నిర్మితమైంది.

 

ధనుష్‌ వరుస విజయాలు..

ధనుష్‌ ఇటీవల వరుస విజయాలు అందుకుంటున్నారు. కొవిడ్‌ తర్వాత అతడు నటించిన నాలుగు మూవీలు రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాయి. తిరు, సార్‌, రాయన్‌ మూవీలతోపాటు తాజాగా విడుదలైన కుబేర ఈ జాబితాలో ఉన్నాయి. ధనుష్‌ నటించిన గత మూవీ రాయన్‌ రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. రూ.150 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. ఈ మూవీకి ధనుష్‌ దర్శకత్వం వహించారు.

 

ఇవి కూడా చదవండి: