Published On:

Nishvika Naidu in Vishwambhara: మెగాస్టార్ సరసన కన్నడ బ్యూటీ.. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు..!

Nishvika Naidu in Vishwambhara: మెగాస్టార్ సరసన కన్నడ బ్యూటీ.. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు..!

Nishvika Naidu in Chiru’s Vishwambhara Movie Special Song: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటాసి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక, ఈ సినిమాను వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

 

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా చిరంజీవి సరసన నటిస్తున్న హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరికి ఈ స్పెషల్ సాంగ్‌లో కన్నడ బ్యూటీ నిశ్వికను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ మ్యూజిక్ బాధ్యతలను భీమ్స్ సిసిరోలియోకు అప్పగించినట్లు టాక్.

 

 

ఇవి కూడా చదవండి: